
Ganesh Idol : మహారాష్ట్రలో భారీ వర్షం కారణంగా వినాయక విగ్రహం అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ఘటనలో విగ్రహం కింద పలువురు భక్తులు చిక్కుకున్నారు. అయితే స్థానికులు, ఇతర భక్తులు వెంటనే స్పందించి వారిని బయటకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని సమాచారం. పాల్ఘర్ జిల్లాలోని నలాసోపారా వెస్ట్‌లో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గణేశ్ చతుర్థి సందర్భంగా మండపంలో ప్రతిష్ఠించేందుకు ఓ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు కళాకారుడి దగ్గర నుంచి వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు.
Also Read : ప్రజ్వల్ రేవణ్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. సెల్ఫోన్లో 250కిపైగా పోర్న్ వీడియోలు
నలసోపరా వెస్ట్‌లో గణేశ్ విగ్రహం పడిన ఘటన
గౌరవ్ ప్రాంతంలో ఆగమన ఊరేగింపు వేళ కలకలం
భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా ఊరేగింపులో ఊహించని ప్రమాదం
విగ్రహం కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీయడంతో తప్పిన పెద్ద ప్రమాదం
భద్రతా చర్యలు పూర్తి చేసి విగ్రహాన్ని యథాస్థానంలో… pic.twitter.com/oVe0JWNWIt
— RTV (@RTVnewsnetwork) September 13, 2026
ఇంతలో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. దీనికి తోడు బలమైన గాలులు కూడా వీచాయి. వర్షం నుంచి విగ్రహాన్ని కాపాడేందుకు భక్తులు దాని చుట్టూ చేరి ప్లాస్టిక్ టార్పాలిన్‌తో కప్పేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో విగ్రహాన్ని తీసుకెళ్తున్న ట్రాలీ అదుపుతప్పడంతో విగ్రహం ఒక్కసారిగా పక్కకు ఒరిగి కిందపడిపోయింది.
Also Read : మేము పోటీ చేయం.. మాజీ సీఎంకు టీఎంసీ తిరుగుబాటు నేతల సంచలన ఆఫర్!
దీంతో అక్కడ ఉన్న భక్తుల్లో భయాందోళన నెలకొంది. సుమారు నలుగురి నుంచి ఐదుగురు వ్యక్తులు విగ్రహం కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికులు, అక్కడున్న ఇతర భక్తులు పరుగెత్తుకుంటూ వచ్చి విగ్రహం కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో భారీ వర్షం మధ్య భక్తులు వినాయక విగ్రహాన్ని ప్లాస్టిక్ కవర్లతో కప్పేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ట్రాలీ అదుపుతప్పి విగ్రహం కిందపడటం, వెంటనే భక్తులు సహాయక చర్యలు చేపట్టడం వీడియోలో కనిపించింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో కూడా శనివారం మరో వినాయక విగ్రహం అదుపుతప్పింది. భయందర్ ప్రాంతంలో నవ్ఘర్ నుంచి షీతల్ ఛాయా మిత్ర మండల్ మండపానికి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా గోల్డెన్ నెస్ట్ చౌక్ దగ్గర విగ్రహం ఒరిగిపోయింది. ఈ ఘటనలోనూ పెద్ద ప్రమాదం తప్పినట్లు సమాచారం.









