
CM Vijay : తమిళనాడు సీఎం, నటుడు విజయ్ బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్ రేసింగ్ ట్రాక్‌కు వెళ్లారు. అక్కడ నటుడు అజిత్ కుమార్‌ను కలుసుకున్నారు. విజయ్, అజిత్ ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్ ప్రస్తుతం అధికారిక పర్యటన కోసం బ్రిటన్ వెళ్లారు. తమిళనాడుకు విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడం, అక్కడి పెద్ద క్రీడా మైదానాలను పరిశీలించడం ఈ పర్యటన ఉద్దేశం. చెన్నై సమీపంలో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న మోటార్ రేసింగ్ సిటీ కోసం కూడా ఆయన అక్కడి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
Also Read : పుతిన్ ఆరస్ Vs జిన్‌పింగ్ హాంగ్చీ.. ఇద్దరిలో ఎవరి కార్ బెస్ట్? ఎవరి కారు ఎక్కువ సేఫ్?
సిల్వర్‌స్టోన్‌లో జరిగిన మిషెలిన్ లే మాన్స్ కప్ కార్ల రేస్‌కు విజయ్ ప్రత్యేక అతిథిగా వెళ్లారు. 44 కార్లు పాల్గొన్న ఈ రేస్‌ను ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రేస్‌లో అజిత్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఆయన తన సొంత జట్టు అజిత్ రెడ్యాంట్ బై విరాజ్ తరఫున ఎల్ఎంపీ3 ప్రోవిభాగంలో పోటీ చేశారు. రేస్ ట్రాక్ వద్ద అజిత్‌ను చూసిన విజయ్ ఆనందంతో ఆయన దగ్గరకు పరుగెత్తుకెళ్లి కౌగిలించుకున్నారు.
ఇదిలా ఉండగా, విజయ్ నటి త్రిషా కృష్ణన్‌తో కలిసి రేస్ చూస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఇద్దరూ ప్రేక్షకులు కూర్చునే చోట నిలబడి రేస్‌ను చూస్తూ కనిపించారు. కెమెరా వారివైపు రావడంతో విజయ్ వెంటనే కొంచెం వెనక్కి వెళ్లారు. దీంతో వారిద్దరూ కలిసి కనిపించిన కొన్ని సెకన్ల వీడియో మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమంలో విజయ్ గోధుమ రంగు జాకెట్ ధరించారు. త్రిషా ఎరుపు రంగు జాకెట్ వేసుకున్నారు. మంత్రి ఆదవ్ అర్జున కూడా వారితో కలిసి కనిపించారు. నటి రాధికా శరత్‌కుమార్ కూడా ఈ రేస్ ట్రాక్ వద్ద కనిపించారు. అంతకుముందు ఆమె లండన్‌లో త్రిషాతో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పెట్టారు. అజిత్ రేస్‌లో బాగా రాణించాలని కోరుతూ ఆమె ఈ ఫొటోను షేర్ చేశారు.
Also Read : త్వరలో గ్లోబల్ ట్రెడ్ కు కేరాఫ్ గా భారత్.. మోదీ కీలక కామెంట్స్!









