
Iranian President : ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ చనిపోయాడంటూ వస్తు్న్న వదంతులను ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఖండించారు. బ్రిక్స్ కూటమి సదస్సు సందర్భంగా ఇండియాకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ మోజ్తాబా ఖమేనీ బతికే ఉన్నారని.. ఆయన తన పని తాను చేసుకుంటున్నారని మసూద్ వివరణ ఇచ్చారు. అయితే మోజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నాడో అమెరికాకు ఆచూకీ దొరకడం లేదని.. అందుకే ఆ దేశం ఆయనను చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమెరికా ఇప్పటికీ ఇరాన్ కు చెందిన పలువురు అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుందని, అందుకే వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారత రాజధాని ఢిల్లీ వేదికగా బ్రిక్స్ కూటమి సదస్సు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ పలు విషయాలు వెల్లడించారు.
Also Read : భారత్ – పాక్ లెంజెండ్స్ టోర్నీ.. బహిష్కరిస్తారా? బరిలోకి దిగుతారా?
ఈ సందర్భంగా ఆయన నేషనల్ మీడియా ఛానల్ అయిన ఇండియా టుడేతో పెజిష్కియాన్ ప్రత్యేకంగా మాట్లాడారు. మీడియా ఇంటర్వ్యూలో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ మరణ వార్తలను ఆయన ఖండించారు. మోజ్తాబా ప్రాణాలతోనే ఉన్నాడని తేల్చి చెప్పారు.
కాగా, 2026, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై మెరుపు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పలువురు మరణించగా, అయతొల్లా ఖమేనీ కుమారుడు అయిన మోజ్తాబా ఖమేనీతో పాటు మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ దాడుల తర్వాత ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ ఆయన బహిరంగంగా ఎక్కడ కనిపించలేదు. అంతేకాదు ఆయన తండ్రి అంత్యక్రియల్లో కూడా పాల్గొనకపోవడం గమనార్హం. దీంతో మోజ్తాబా ఖమేనీ కూడా చనిపోయాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మోజ్తాబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నాడని ఇరాన్ అధ్యక్షుడు పేర్కొనడంతో అతడి మరణ వార్తలపై వస్తున్న పుకార్లకు తెరపడినట్లయింది.
Also Read : అమెరికా ఎన్నికల్లో ఓటు వేసేందుకు యత్నం: భారతీయుడిపై కేసు









