
బంగ్లాదేశ్ సైన్యంలో ఇటీవల ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సైనిక శిక్షణలో భాగంగా జరిగిన ట్యాంక్ ఫైరింగ్ విన్యాసాల్లో అనుకోకుండా ట్యాంక్ బ్యారెల్ పేలిపోవడంతో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి అసలు కారణం పాకిస్తాన్ సరఫరా చేసిన నాణ్యత లేని మందుగుండు సామగ్రినేనని ఆధారాలు బయటపడుతున్నాయి.
Also Read : పాకిస్తాన్ నకిలీ బాంబులు.. బంగ్లాదేశ్ ట్యాంక్ బ్లాస్ట్.. ఇద్దరు సైనికులు దుర్మరణం.. అసలేమైందంటే?
Chinese tank explodes during Bangladesh Army drills, leaving 2 soldiers dead. 💥🪖
Once again, the global reputation of poor-quality, substandard Chinese equipment proves true. 🇨🇳📉
Yet, this very nation dreams of fighting a war against India! pic.twitter.com/QA0LxjZCDq
— Sanatan Prabhat (Kannada) (@Sanatan_Prabhat) September 11, 2026
గత బుధవారం రోజున బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఉన్న ‘హాట్ హజారీ’ ఫైరింగ్ రేంజ్‌లో బంగ్లాదేశ్ ఆర్మీ సాధారణ సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ విన్యాసాలలో చైనా తయారీకి చెందిన ‘టైప్ 59G దుర్జోయ్’ అనే ప్రధాన యుద్ధ ట్యాంక్‌ను ఉపయోగించారు. విన్యాసాల్లో భాగంగా ట్యాంక్ నుంచి గుండు పేల్చడానికి ప్రయత్నించగా.. ఊహించని విధంగా ఆ ట్యాంక్ బ్యారెల్ తీవ్రమైన ఒత్తిడికి గురై గాల్లోనే పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బంగ్లాదేశ్ సైనికులు చనిపోయారు. అయితే ఈ ప్రమాదంపై విచారణ జరిపిన అధికారులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్యాంక్ చైనాలో తయారైనప్పటికీ అందులో ఉపయోగించిన ‘125 mm HE-FS TK’ రకానికి చెందిన మందుగుండు సామగ్రి మాత్రం పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్నవేనని తేలింది.
Also Read : కాంగో పాఠశాలలో ఘోర అగ్నిప్రమాదం.. సజీవదహనమైన 29 మంది చిన్నారులు.. ఏమైందంటే?
2024లో బంగ్లాదేశ్‌లోని మహమ్మద్ యూనస్ ప్రభుత్వ హయాంలో పాకిస్తాన్‌లోని ‘పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ’ నుంచి సుమారు 2,000 ట్యాంక్ బాంబులను బంగ్లాదేశ్ కొనుగోలు చేసింది. అయితే ఈ పాకిస్తానీ సంస్థ తయారుచేసే ఆయుధాలు, మందుగుండు సామగ్రి నాసిరకంగా ఉంటాయని, నాణ్యతా ప్రమాణాల తనిఖీల్లో తరచూ విఫలమవుతుంటాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
పాకిస్తానీ ఆయుధాల వల్ల బంగ్లాదేశ్ సైన్యం ప్రమాదంలో పడటం ఇది మొదటిసారేమీ కాదు. 2024 మే నెలలో కూడా చట్టోగ్రామ్ ఫైరింగ్ రేంజ్‌లో సరిగ్గా ఇదే ‘టైప్ 59G దుర్జోయ్’ ట్యాంక్ పేలిపోయి ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఘటన తర్వాత చైనా నుంచి ప్రత్యేక నిపుణుల బృందం బంగ్లాదేశ్‌కు వచ్చి విచారణ చేపట్టింది. ట్యాంక్ తయారీలో లోపం లేదని.. పాకిస్తాన్ నుంచి తెప్పించిన నిసిరకం మందుగుండు సామగ్రి వల్లే ఆ పేలుడు జరిగిందని చైనా నిపుణులు స్పష్టమైన నివేదిక ఇచ్చారు. అంతేకాకుండా 2022లోనే పాకిస్తాన్‌లోని వాహ్ క్యాంటోన్మెంట్‌లో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసిన 125 mm రకం బాంబులు నాణ్యతా పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయని అంతర్గత నివేదికలు కూడా వెల్లడించాయి.
గతంలో హెచ్చరికలు వచ్చినా నాణ్యతా లోపాలు బయటపడినా కూడా పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేసిన ఆ నాసిరకం బాంబులను బంగ్లాదేశ్ ఆర్మీ వాడటం వల్లే ఇప్పుడు మరో ఇద్దరు సైనికులు బలయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. నాసిరకం ఆయుధాలను అప్పగించి పాకిస్తాన్ తమ సైనికుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని బంగ్లాదేశ్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.









