Xi Jinping : భారతదేశం అతిథ్యం ఇవ్వనున్న బ్రిక్స్ సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌(Xi Jinping) హాజరువుతారా? లేదా అన్న సందిగ్ధానికి తెరపడింది. ఆయన భారత్‌ పర్యటన విషయంలో కొనసాగుతోన్న సస్పెన్స్‌కు తెరదించుతూ సదస్సులో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు రానున్నట్లు చైనా ప్రభుత్వ రంగ మీడియా సంస్థ జిన్హువా ధృవీకరించింది.

Also Read : మండుటెడారిలో 4 కోట్ల మందికి నీళ్లు.. ఎలాగంటే..?

దేశ రాజధాని ఢిల్లీలోని భారత్‌ మండపంలో ఈ నెల 12, 13 తేదీల్లో బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు సభ్య దేశాలైన 11 దేశాల అగ్రనేతలు హాజరవ్వాల్సి ఉంది. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాకపై గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. అంతేకాక, సమావేశం గురించి తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని అంతకుముందు చైనా విదేశాంగ శాఖ చెప్పడంతో ఈ సందిగ్ధత మరింత ముదిరింది. దీంతో అసలు జిన్‌పింగ్‌ బ్రిక్స్‌ సదస్సుకు వస్తారా? లేదా? అనే అంశంపై ఇన్నాళ్లు సస్పెన్స్‌ నెలకొంది. అయితే తాజాగా జిన్‌పింగ్‌ పర్యటనపై చైనా అధికారిక మీడియా నుంచి ప్రకటన వెలువడడంతో ఆ సస్పెన్స్‌కు తెరపడింది.

నిజానికి భారత్‌ -చైనాల మధ్య అనేక దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలు జరుగుతున్నాయి. 1962లో మొదటిసారి యుద్ధం వీటికి నాంది పలికింది. ఆ తర్వాత 2020లో గల్వాన్‌ ఘర్షణతో అవి మరింత తీవ్రమయ్యాయి. అయితే ఈ మధ్యకాలంలో రెండు దేశాలు సరిహద్దుల విషయంలో కాస్త మెత్తబడ్డాయి. ఈ సందర్భంలోనే గతేడాది షాంఘై సహకార సదస్సు (SCO)కు ప్రధాని మోదీ హాజరైన సంగతి తెలిసిందే. కాగా ఈ బ్రిక్స్‌ సదస్సుకు ముందు మోదీ, జిన్‌పింగ్‌ ప్రత్యేకంగా భేటీ అయి ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిన్‌పింగ్ చివరిసారిగా 2019లో భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత భారత్-చైనా సంబంధాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 2020లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ ఘర్షణ ఇరు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. కాగా, ఈ పరిణామాల తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Also Read : షేక్ హసీనా కుమార్తె సంచలన నిర్ణయం.. WHO పదవికి రాజీనామా!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.