టెక్ దిగ్గజం యాపిల్ తర్వాత తరం ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు అయిన ఐఫోన్ 18 ప్రో(iPhone 18 Pro), ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడళ్లను ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా విడుదల చేసింది. ఓల్డ్ సిరీస్ ఐఫోన్ 17 ప్రో సిరీస్‌తో పోలిస్తే ఈ నయా మోడళ్లలో ఆపరేటింగ్ స్పీడ్, ప్రాసెసింగ్ పవర్, కెమెరా టెక్నాలజీ, బ్యాటరీ సామర్థ్యం విభాగాల్లో అత్యంత విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఐఫోన్ చరిత్రలోనే అతిపెద్ద బ్యాటరీలను, అత్యంత వేగవంతమైన 2nm ప్రాసెసర్‌ను ఈ ఫోన్లలో అమర్చడం విశేషం. భారత్‌తో సహా గ్లోబల్ మార్కెట్లలో సెప్టెంబర్ 12 నుంచి ప్రీ-ఆర్డర్లు షురూ కానుండగా, సెప్టెంబర్ 18 నుంచి విక్రయాలు అందుబాటులోకి రానున్నాయి.

Also Read : నా దవడ ఎముకలు విరిగాయి.. విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ రిప్లై!

ఈ నయా ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో ప్రపంచంలోనే మొదటిసారిగా 2nm టెక్నాలజీ ఆధారంగా తయారు చేసిన A20 ప్రో చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది కష్టమైన హెవీ టాస్క్‌లు, హై-ఎండ్ గేమింగ్, ఏఐ ప్రాసెసింగ్‌లను అత్యంత వేగంగా, ఎలాంటి ల్యాగ్ లేకుండా పూర్తి చేస్తుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే ఐఫోన్ 18 ప్రో మోడల్ 6.3 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో రాగా ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడల్ 6.9 అంగుళాల భారీ సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. రెండింటిలోనూ హై బ్రైట్‌నెస్, అద్భుతమైన కలర్ విజువల్స్ అందించే ప్రోమోషన్ సాంకేతికతను అందించారు.

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ డివైజ్‌లలో 48MP వేరియబుల్ అపర్చర్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అమర్చారు. ఈ సెన్సార్లు వెలుతురు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా అత్యంత స్పష్టమైన, ప్రో-లెవల్ ఫోటోలను అందిస్తాయి. మెరుగైన ఆప్టికల్ జూమ్ సౌకర్యం కూడా ఇందులో ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 18MP విత్ సెంటర్ స్టేజ్ కెమెరాను పొందుపరిచారు. యాపిల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే వర్చువల్ అసిస్టెంట్ సిరిని సరికొత్త ఏఐ రూపంలో అప్‌గ్రేడ్ చేశారు. ఇది వివిధ యాప్‌లలోని కంటెంట్‌ను సులభంగా అర్థం చేసుకుని, వినియోగదారుల రోజువారీ పనులను వేగంగా పూర్తి చేసే పర్సనల్ ఏఐ హబ్‌గా వ్యవహరిస్తుంది.

ఐఫోన్ చరిత్రలోనే ఇప్పటివరకు చూడని అత్యంత భారీ బ్యాటరీలను ఈ కొత్త మోడళ్లలో అమర్చినట్లు యాపిల్ తెలిపింది. A20 ప్రో ప్రాసెసర్ వల్ల పవర్ వినియోగం గణనీయంగా తగ్గి ఐఫోన్ 18 ప్రోలో 36 గంటల వీడియో ప్లేబ్యాక్, ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో ఏకంగా 45 గంటల వీడియో ప్లేబ్యాక్ లభిస్తుంది. కనెక్టివిటీ కోసం ఇందులో సరికొత్త ‘C2’ మోడెమ్‌ను అమర్చారు. ఈ రెండు మోడళ్లు బర్గండీ, గ్లేసియర్, సిల్వర్, బ్లాక్ అనే నాలుగు రంగులలో లభిస్తాయి.

మోడళ్ల వారీగా ప్రతి వేరియంట్, ధరలు, ఫీచర్ల వివరాలు
ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro)
256GB వేరియంట్: రూ. 1,64,900
512GB వేరియంట్: రూ. 1,89,900
1TB వేరియంట్: రూ. 2,39,900
2TB వేరియంట్: రూ. 3,14,900

Also Read : జెలెన్‌స్కీ విమానానికి డ్రోన్ ముప్పు.. తృటిలో తప్పిన ప్రమాదం!

ఫీచర్లు
డిస్‌ప్లే: 6.3 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే
ప్రాసెసర్: A20 ప్రో చిప్‌సెట్ (2nm టెక్నాలజీ)
రేర్ కెమెరా: 48MP వేరియబుల్ అపర్చర్ ట్రిపుల్ కెమెరా వ్యవస్థ
ఫ్రంట్ కెమెరా: 18MP విత్ సెంటర్ స్టేజ్
బ్యాటరీ లైఫ్: 36 గంటల వీడియో ప్లేబ్యాక్ (24 గంటల సాధారణ వినియోగం)
నెట్‌వర్క్ మోడెమ్: C2 మోడెమ్

ఐఫోన్ 18 ప్రో మాక్స్ (iPhone 18 Pro Max)
256GB వేరియంట్: రూ. 1,79,900
512GB వేరియంట్: రూ. 2,04,900
1TB వేరియంట్: రూ. 2,54,900
2TB వేరియంట్: రూ. 3,29,900

ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.9 అంగుళాల భారీ సూపర్ రెటినా XDR డిస్‌ప్లే
ప్రాసెసర్: A20 ప్రో చిప్‌సెట్ (2nm టెక్నాలజీ)
రేర్ కెమెరా: 48MP వేరియబుల్ అపర్చర్ ట్రిపుల్ కెమెరా వ్యవస్థ
ఫ్రంట్ కెమెరా: 18MP విత్ సెంటర్ స్టేజ్
బ్యాటరీ లైఫ్: 45 గంటల వీడియో ప్లేబ్యాక్ (30 గంటల సాధారణ వినియోగం)
నెట్‌వర్క్ మోడెమ్: C2 మోడెమ్

ఆపిల్ సంస్థ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ డ్యూయోను కూడా విడుదల చేసింది. పుస్తకంలా మడిచే డిజైన్‌తో వస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో డ్యూయల్ డిస్‌ప్లేలు, ఫోల్డబుల్ స్క్రీన్‌కు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన ప్రాసెసింగ్ ఆర్కిటెక్చర్‌ను అందించారు. లోపలి భాగంలో 7.6-అంగుళాల సూపర్ రెటినా XDR ఫోల్డబుల్ డిస్‌ప్లే, వెలుపలి భాగంలో 5.4-అంగుళాల కవర్ స్క్రీన్ ఉన్నాయి. సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో వచ్చే మడత మార్క్, స్క్రీన్ కాంతి పరావర్తనాన్ని తగ్గించేందుకు ప్రత్యేకమైన ‘నానో-టెక్చర్ ఫినిషింగ్’ ఇచ్చారు. అంతేకాకుండా స్క్రాచ్ పడకుండా ఆపిల్ పేటెంట్ కోటింగ్‌ను ఉపయోగించారు. రెండు స్క్రీన్‌లను ఏకకాలంలో నడిపేందుకు శక్తివంతమైన A20 ప్రో చిప్తో పాటు ప్రత్యేక డిస్‌ప్లే ఇంజిన్‌ను అమర్చారు. వేగవంతమైన మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ కోసం ఇందులో C2 సెల్యులార్ మోడెమ్ ఇచ్చారు. పెద్ద స్క్రీన్‌ను సమర్థవంతంగా వాడుకునేందుకు iOSలో ‘స్ప్లిట్ వ్యూ’ మల్టీటాస్కింగ్ తీసుకొచ్చారు. దీని ద్వారా స్క్రీన్ పైభాగంలో వీడియో చూస్తూనే కింది భాగంలో వేరే యాప్స్ వాడుకోవచ్చు. ఫోన్‌ను సగం మడిచినా, ఎలా తిప్పినా ఆ కోణానికి తగ్గట్లుగా మారే ఆపరేటింగ్ సిస్టమ్, రీ-డిజైన్ చేసిన ‘స్టాండ్‌బై మోడ్’ ఇందులో ఉంది. 256GB బేస్ వేరియంట్ ప్రారంభ ధర సుమారు రూ.1.68 లక్షలు గా నిర్ణయించారు.