Nepal Floods : నేపాల్‌ లో సంభవించిన ఆకాల వర్షాల మూలంగా గల్లంతయిన వారికోసం రెస్క్యూ ఆఫరేషన్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా వేలాది మంది ఆచూకీ లభించకపోవడంతో వారికోసం సహాయక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. నేపాల్‌ నువాకోట్‌లోని బెట్రావతిలో సంభవించిన భారీ వరదల కారణంగా శిథిలాల కింద చిక్కుకుపోయిన 64 ఏళ్ల చండికా కుమారి శ్రేష్ఠ అనే మహిళను 10 రోజుల తర్వాత సజీవంగా రక్షించారు.

Also Read : ఖర్గ్‌ఐలాండ్‌ పై అమెరికా మరోసారి దాడి… ఈసారి లక్ష్యం ఏంటంటే?

ఆమె ఆ నాలుగు అంతస్తుల భవనం లోపల అపస్మారక స్థితిలో ఉండగా, ఇన్‌స్పెక్టర్ సుమన్ కుమార్ బీకే నేతృత్వంలోని సాయుధ పోలీసు దళం ఆమెను రక్షించింది. ప్రాథమిక చికిత్స కోసం ఆమెను హెలికాప్టర్ ద్వారా నేపాలీ ఆర్మీకి చెందిన మైథిలి బ్యారక్స్‌కు తరలించారు. బిదుర్ మునిసిపాలిటీ-10 లోని ఆనంద్ శ్రేష్ఠకు చెందిన ఇల్లు శిథిలావస్థకు చేరగా, అందులోని ఎగువ అంతస్తులో అపస్మారక ఉన్న చండికా కుమారి శ్రేష్ఠను శనివారం రక్షించినట్లు నేపాల్‌ రక్షక దళం పేర్కొంది.

ఇన్‌స్పెక్టర్ సుమన్ కుమార్ బిక్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బృందం ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టింది. ఆమెను రక్షించిన అనంతరం, ప్రాథమిక చికిత్స కోసం హెలికాప్టర్‌లో త్రిశూలిలోని నేపాల్ సైన్యానికి చెందిన మైథిలీ బ్యారక్స్‌కు తరలించారు. అవసరమైతే తదుపరి మెరుగైన వైద్యం కోసం ఆమెను ఖాట్మండుకు తరలిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. భోటేకోషి నదికి వచ్చిన వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించి, అనేక జిల్లాల్లో వేలాది మందిని గల్లంతు చేసిన 11 రోజుల తర్వాత ఈ అద్భుత రెస్క్యూ ఆఫరేషన్‌ చేపట్టగా, వృద్ధురాలు సజీవంగా దొరకడం విశేషం.

Also Read : టిక్‌టాక్‌ ఫాలోవర్ల కోసం చెల్లితో గొడవ.. 15 ఏళ్ల చెల్లిని కత్తితో చంపిన అక్క!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.