
Health Department : తెలంగాణ ఆరోగ్యశాఖలో మరో భారీ రిక్యూట్మెంట్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (MPHA) పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను అధికారులు ఈ మేరకు విడుదల చేశారు. అభ్యర్థులను 1:1.25 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపిక చేసినట్లు తెలిపారు.
షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు సెప్టెంబర్ 16వ నుంచి 26వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ వెంగల్రావునగర్లోని IIFHWలో ఈ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. నిర్ణీత తేదీల్లో వెరిఫికేషన్‌కు హాజరు కాలేని అభ్యర్థులకు సెప్టెంబర్ 28వ తేదీన మరో అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులనుకూడా తీసుకురావాలని సూచించారు. విద్యార్హతలు, ఇతర అవసరమైన ధ్రువపత్రాలను అధికారులు పరిశీలిస్తారని తెలిపారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఫైనల్ మెరిట్ లిస్ట్‌తో పాటు సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
గత రెండున్నరేళ్లలో తెలంగాణ ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న15 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కొనసాగిస్తోందన్నారు. ప్రస్తుతం మరో 2 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతోందని వెల్లడించారు.
1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో చోటు దక్కిన అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు, అవసరమైన ధ్రువపత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు.









