
PM MODI : భారత ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అంచనాలకు మించి 7.8 శాతం వృద్ధి నమోదు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన ఆయన.. ఇదే సమయంలో మరోసారి ఆత్మనిర్భర్ భారత్ కోసం స్వదేశీ వస్తువులు, సేవలను ఎక్కువగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టపడి పనిచేసే తత్వం, సంకల్ప బలానికి ఈ వృద్ధి నిదర్శనమని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు కొనసాగుతున్న సమయంలో భారత్ ఇంతటి వృద్ధిని సాధించిందని ప్రధాని పేర్కొన్నారు. యుద్ధాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నదని, 2020లో కరోనా మొదలైనప్పటి నుంచి ప్రపంచంలో ఎక్కడా పూర్తి స్థిరత్వం కనిపించడం లేదని అన్నారు. అయినప్పటికీ భారత్ వేగంగా ముందుకు సాగుతోందని చెప్పారు.
Also Read : సోషల్ మీడియాలోనే గ్రేట్ ప్లేయర్. బాబర్ ఆజంపై మాజీ క్రికెటర్ ఫైర్
సోమవారం విడుదలైన గణాంకాల ప్రకారం.. 2026 ఏప్రిల్ నుంచి జూన్ వరకు భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి చెందింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ఇరాన్‌లో యుద్ధం కారణంగా ఏర్పడిన పరిస్థితుల ప్రభావం ఉంటుందన్న ఆందోళనల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఈ గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రజలు స్వదేశీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో పెళ్లిళ్లు, అవసరం లేని బంగారం కొనుగోళ్లను తగ్గించాలని సూచించారు. వినోదం కోసం విదేశాలకు ప్రయాణాలు చేయకండి. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ నిర్వహించకుండా ఉండండి. వెడ్ ఇన్ ఇండియా అనే ఆలోచనను పాటించాలి. అవసరం లేకపోతే బంగారం కొనకండి” అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
ప్రజలు ఎంత ఎక్కువగా భారతీయ ఉత్పత్తులు, సేవలను ఉపయోగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ అంతగా బలపడుతుందని ఆయన అన్నారు. స్వయం సమృద్ధి దిశగా ఇదే విధంగా ముందుకు సాగితే.. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి అభివృద్ధి చెందిన దేశాన్ని యువతకు అందించగలమని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వృద్ధిని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని, అదే సమయంలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు మరింత కష్టపడాలని ప్రధాని పిలుపునిచ్చారు.
అలాగే ఏడాది పాటు అవసరం లేని విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో పెళ్లిళ్లను తగ్గించాలని, అత్యవసరం కాని బంగారం కొనుగోళ్లను కూడా తగ్గించాలని కోరారు. దీనివల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. అదే సమయంలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఎక్కువగా కొనాలని ప్రజలను ప్రోత్సహించారు.
Also Read : వినియోగదారుల జోబుకు చిల్లు.. సెప్టెంబర్ 1 నుంచి బిగ్ చేంజెస్.. మారనున్న 6 ముఖ్యమైన రూల్స్ ఇవే!









