
Kavya Kalyan Ram : టాలీవుడ్ లో మరో లవ్ జంట తమ ప్రేమను బయటపెట్టింది. అంతేకాదు ఈ ప్రేమజంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఆ జంట ఎవరో తెలుసా? బలగం సినిమాతో కుర్రకారు గుండెల్లో పొట్టిపిల్లగా నిలిచిపోయిన కావ్య కల్యాణ్‌రామ్, ఆస్కార్ బహుమతి విజేత ఎంఎం కీరవాణి కొడుకు, సంగీత దర్శకుడు కాలభైరవ. అవును వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలాకాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్ లో ఉన్నారని ఫిలిం ఇండస్ట్రీలో ముమ్మరంగా సాగుతున్న ప్రచారానికి స్వయంగా ఈ జంట చెక్ పెట్టడం గమనార్హం.
Also Read : బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తున్న రవితేజ ‘ఇరుముడి’.. రూ.170 కోట్లతో రికార్డుల వర్షం
View this post on Instagram
ఈ మేరకు కావ్య తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కాల భైరవతో సన్నిహితంగా ఉన్న క్యూట్ ఫోటోలను షేర్ చేశారు. దానికి కావ్య ఓ బ్యూటిఫుల్ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ‘లైఫ్ అప్‌డేట్: ఐ ఫౌండ్ మై యెల్లో పేపర్ డైసీ! కొంతమంది మన జీవితంలోకి వచ్చాక, మనం దేవుడికి ఎంతో ఇష్టమైన బిడ్డలమనే భావన కలిగిస్తారు. సరిగ్గా మనకు తగ్గ వ్యక్తి దొరికినప్పుడు ప్రపంచం మరింత అందంగా కనిపిస్తుంది’ అంటూ మనసులోని ప్రేమనంతా ఒలకబోస్తూ రాసుకొచ్చింది.
అంతటితోనే ఆగకుండా .. ‘నా సాధారణ రోజులను సైతం ప్రత్యేకంగా మార్చినందుకు థ్యాంక్స్ భైరవ. నేను వద్దన్నా కూడా నాకు డైట్ కోక్ కావాలని గుర్తుపెట్టుకునే నువ్వు నా జీవితంలో జీవితాంతం ఉండాలి’ అంటూ తన ప్రేమను ప్రపోజ్ చేసినట్లు క్యాప్షన్ ఇవ్వడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. కాగా, కాల భైరవ కూడా తమ బాండింగ్ జీవితాంతం కొనసాగుతుందని సోషల్ మీడియా వేదికగా స్పందించడంతో వారిద్దరి రిలేషన్ పై అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. ఆ జంటకు ఫ్యాన్స్, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read : ముగిసిన వివాదం.. బాబా రాందేవ్, కంగనా రనౌత్ మధ్య కుదిరిన సయోధ్య!
కాగా, కావ్య చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘గంగోత్రి’ సినిమాలో నటించింది. ఆ చిత్రంలో చిన్నప్పటి ‘వల్లభి’ గా మెప్పించిన కావ్య.. ఆ తర్వాత బాలనటిగా పలుచిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ‘మసూద’, ‘బలగం’ సినిమాలతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి విజయం సాధించింది. అయితే ఈ మధ్య సినిమాలు లేకపోయినప్పటికీ తరచుగా టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తోంది. మరోవైపు ‘ఆర్‌ఆర్ఆర్’ లో పాటలతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నాడు కాలభైరవ. మ్యూజిక్ డైరెక్టర్‌గా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
కాగా, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో ఈ జంట ఒకటిగా దర్శనమిచ్చి అందరి దృష్టినీ ఆకర్షించింది. అప్పుడే చాలా మంది వారిద్దరూ లవ్ లో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రసారం సాగింది. తాజాగా ఈ లవ్ బర్డ్స్.. తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ప్రచారం సాగుతోంది. టాలీవుడ్ నుంచి ఇప్పటికే చాలమంది నటీనటులు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. కొంతమంది భార్యభర్తలుగా స్థిరపడగా, కొంతమంది విడిపోయి ఎవరిజీవితం వారు గడుపుతున్నారు. మరికొంతమంది ఇంకా ప్రేమలో ఉన్నారు, తాజాగా కావ్య కళ్యాణ్ రామ్, కాల భైరవ కూడా లవ్ బర్డ్స్ జాబితాలో చేరడంతో ఈ ప్రేమ జంటకు ఫ్యాన్స్ , సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.









