
నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి(Gold Prices Dropped). గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1400 తగ్గి రూ.1,56,770 వద్ద కొనసాగుతోంది. అలాగే సాధారణంగా పసిడి ఆభరణాల తయారీ కోసం ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1200 తగ్గి రూ.1,43,779గా నమోదైంది. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ. 2,42,190 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర 4,488 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధర ఏకంగా రూ. 1.83 లక్షల వద్ద ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేయగా అక్కడి నుంచి క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ. 1.50 లక్షల దిశగా దిగివస్తోంది.
Also Read : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు
అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ విలువ బలపడటమే అని నిపుణులు అంటున్నారు. డాలర్ విలువ బలపడే కొద్దీ బంగారం ధ ర తగ్గుతుంది. బంగారం ధరలు గరిష్ట స్థాయి నుంచి తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్కు డిమాండ్ పెరగడంతో పాటు సెప్టెంబర్ నెలలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుంది అని వార్తలు రావడమే. దీంతో ట్రేడర్లను బంగారం వైపు నుంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేందుకు దారితీశాయని చెప్పవచ్చు.
Also Read : నేపాల్‌లో తొలగని వరద ముప్పు.. మళ్లీ పెను ప్రమాదం పొంచి ఉందా?









