
ఉత్తర సైప్రస్ నుంచి తుర్కియే వైపు ప్రయాణిస్తున్న ఒక పెద్ద పడవ ప్రమాదవశాత్తూ బోల్తా పడి సముద్రంలో మునిగిపోయింది. ఈ విషాదకర ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా పలువురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో సుమారు 270 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
Also Read : డార్క్ వెబ్‌లో ఉగ్ర కుట్ర.. అశ్లీల సైట్లు, సీక్రెట్ యాప్‌లతో పాక్ ISI డర్టీ గేమ్!
BREAKING: Ferry with ~270 people capsizes off northern Cyprus – at least 8 dead, dozens missing
#CyprusFerry #NorthernCyprus #FerryDisaster #MediterraneanNews pic.twitter.com/OQPovGoxcJ— Devesh , वनवासी (@Devesh81403955) August 31, 2026
ఉత్తర సైప్రస్‌లోని ప్రసిద్ధ కైరేనియా ఓడరేవు నుంచి ఫెర్రీ తుర్కియే వైపు బయలుదేరింది. అయితే ప్రయాణం ప్రారంభించిన కేవలం 15 నిమిషాల్లోనే వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. తీవ్రమైన ఈదురుగాలులు, సముద్రంలో పెద్ద ఎత్తున ఎగసిపడిన అలల ధాటికి పడవ నియంత్రణ కోల్పోయి నీటిలో మునిగిపోవడం ప్రారంభమైంది. ఊహించని ఈ ప్రమాదంతో పడవలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
పడవ మునిగిపోతున్న సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, కోస్ట్ గార్డ్ సిబ్బంది వేగంగా స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి.. దాదాపు 237 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసి ఒడ్డుకు చేర్చగలిగాయి. కాపాడిన వారిలో కొందరికి స్వల్ప గాయాలు కావడంతో వారికి స్థానిక ఆసుపత్రులలో ప్రాథమిక వైద్య సహాయం అందిస్తున్నారు.
ఈ ప్రమాదంపై సైప్రస్ ప్రధాని ఉనాల్ ఉస్టెల్ స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాతావరణం అకస్మాత్తుగా క్షీణించడమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని తెలిపారు. నీటిలో గల్లంతైన మిగిలిన ప్రయాణికుల కోసం సముద్రంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
Also Read : భారతీయులకు అమెరికా బిగ్ షాక్.. ఆ రూల్ క్యాన్సిల్.. ఇక ఐటీ నిపుణులకు కష్టకాలమే!









