
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. తృణమూల్ ఛాత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం నిర్వహణకు కలకత్తా హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.
శనివారం కోల్‌కతా పోలీసులు తమంతట తాముగా కేసు నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. మమతా బెనర్జీతో పాటు TMCP సమావేశాన్ని నిర్వహించిన నిర్వాహకులపై కూడా కేసు పెట్టినట్లు చెప్పారు.
Also Read : జైలులోకి వెళ్లిన సీఎం విజయ్.. ఖైదీలతో మాట్లాడి, భోజనం చెక్ చేసి!
ఈ కేసు కోల్‌కతాలోని హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. హైకోర్టు విధించిన ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై FIR నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారందరి పాత్రపై దర్యాప్తులో భాగంగా విచారణ చేపడతామని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఈ ఘటనలో ఎవరెవరి పాత్ర ఉందనే విషయాన్ని దర్యాప్తు తర్వాత తేలుస్తామని తెలిపారు.
కేంద్ర కోల్‌కతాలోని క్యాథెడ్రల్ రోడ్డులో శుక్రవారం TMCP వ్యవస్థాపక దినోత్సవ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహణకు హైకోర్టు విధించిన షరతులను పరిశీలించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : ముగిసిన వివాదం.. బాబా రాందేవ్, కంగనా రనౌత్ మధ్య కుదిరిన సయోధ్య!









