
Flash Floods : మొన్నటి నేపాల్ జలవిలయం సృష్టించిన విధ్వంసం కండ్లముందే కదలాడుతోంది. ఈ క్రమంలో మనదేశంలోనూ ఇటువంటి ప్రమాదాలకు అవకాశం ఉందా? అంటే అవుననే అంటున్నారు. ఐటీ రోపర్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ వారి హెచ్చరిక ప్రకారం మనదేశంలో 88 హిమానీనదాలు ప్రమాదకరస్థాయిలో ఉన్నాయి. ఇవి ఒకవేళ గట్టు తెంచుకుంటే భారత్‌లో తీవ్ర నష్టం వాటిల్లక తప్పదంటున్నారు. కాగా ఈ 88 హిమానీనదాలు హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉన్నాయని తేలింది.
Also Read : నేపాల్‌కు మళ్లీ వరద ముప్పు.. చైనా నుంచి అత్యవసర హెచ్చరిక.. మరో మూడు రోజుల్లో ప్రళయమే?
మొన్న నేపాల్‌లోని భోటే కోషె హిమనదిలో మంచుకొండలు విరిగి పడటంతో ఒక్కసారిగా నది ఉప్పొంగి తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అయితే అంతకు మించి విధ్వంసం సృష్టించగల 88 అత్యంత ప్రమాదకర హిమానీనదాలు మనదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నాయని తేలింది. హిమలయా పర్వతాల్లో అధిక ఎత్తులో ఉండే ఈ హిమనదులు కరిగినప్పుడు వాటి నుంచి వచ్చే నీరు సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో లేదా రాతి గోడల వెనక చేరుతుంది. అలా చేరిన నీటితో క్రమంగా అక్కడ ఒక సరస్సు ఏర్పడుతుంది. చూడడానికి మంచులా ఉన్నప్పటికీ పైన మంచు పేరుకుని దిగువన నీటినిలువతో ఉండే వీటినే హిమానీనదాలు అంటారు. ఈ సరస్సు మంచు, రాళ్లు, కొండచరియల మట్టితో సహజ సిద్ధంగా ఏర్పడుతాయి. ఏదైనా కారణాలతో ఈ సహజ ఆనకట్ట తెగిపోయినా, లేదా భూప్రకంపనల వల్ల మంచు, కొండ చరియలు కదిలితే ఆ సరస్సులో ఉన్న లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలను ముంచేత్తుంది. ఇలా సడన్ గా ఏర్పడే నీటి విధ్వంసాన్ని గ్లాసిక్ లేక్ ఔట్‌రేజ్ బరస్ట్ అంటారు.
ఐఐటీ రోపర్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ నివేదిక ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో ఇలాంటి హిమానీనదాలు 88 వరకు ఉన్నాయి. అంతేకాక, ఇవన్నీ కూడా చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఇందులో 9 అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉండగా.. 18 అత్యధిక ప్రమాదకరంగా, 26 ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా బియాస్‌లోని హిమ్సు సరస్సు, సట్లెజ్ బేసిన్‌లోని పేరుపెట్టని సరస్సులు పూర్తి స్థాయి ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. హిమ్సు ఆనకట్ట తెగితే సెకనుకు 1,385 క్యూబిక్ మీటర్ల నీటి ప్రవాహం దిగవకు చేరి భారీ వరదలను సృష్టించగలదు. అంటే సెకనుకు 1.4 మిలియన్ల లీటర్ల నీరు దిగువన ఉన్న ప్రాంతాలను తుడిచిపెట్టేయగలదు. సట్ల్లెజ్ లోని సరస్సు ఆనకట్ట తెగితే సెకనుకు ఏకంగా 3,507 క్యూబిక్ మీటర్ల నీటి ప్రవాహంతో 3.5 మిలియన్ లీటర్ల నీరు కిందికి దూకుతుంది. దీనివల్ల వందలాది నిర్మాణాలు తుడిచిపెట్టుకుపోతాయి. ఈ ప్రమాదాలను గుర్తించి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండటం తప్ప చేసేదేం లేదని పరిశోధకులు అంటున్నారు.
Also Read : ఇది చైనా చేసిన ఉద్ధేశపూర్వక పర్యావరణ విపత్తు..నేపాల్ జర్నలిస్టుల ఎక్స్ హ్యాండిల్ సంచలన ఆరోపణ









