
TMC : తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీల పదవుల గండంపై రాజకీయంగా పెద్ద కలకలం రేగుతోంది. ఈ వ్యవహారంలో లోక్‌సభ సచివాలయం తాజాగా ఆ 20 మంది ఎంపీలకు నోటీసులు పంపింది. టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ పెట్టిన పిటిషన్ పై ఏడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో కోరారు.
Also Read : రీల్స్ మోజులో రెండు చేతులు కోల్పోయిన యువతి : జార్ఖండ్‌లో ఘోరం!
ఈ ఎంపీలంతా టీఎంసీ పార్టీని వదిలేసి వేరే పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్ నెలలోనే టీఎంసీ నాయకులు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అభిషేక్ బెనర్జీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, ఈ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ పరిణామాలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. తాము ఫిర్యాదు చేసి చాలా రోజులు అవుతున్నా స్పీకర్ ఇప్పటివరకు స్పందించలేదని, ఇప్పుడు హడావుడిగా నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.
మా పార్టీ గుర్తు మీద గెలిచి, వేరే పార్టీలోకి వెళ్లిన వీరికి సభ్యత్వం కొనసాగించే అర్హత లేదని, వెంటనే వారిని అనర్హులుగా ప్రకటించాలని టీఎంసీ పట్టుబడుతోంది. కానీ తాము చేసిన మార్పు చట్టబద్ధమైనదేనని రెబల్ ఎంపీలు వాదిస్తున్నారు. ఈ వివాదంలో ఉన్న 20 మంది ఎంపీలలో సుదీప్ బందోపాధ్యాయ, శతాబ్ది రాయ్, రచనా బెనర్జీ, యూసఫ్ పఠాన్‌తో పాటు మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నారు.
Also Read : మంత్రి వర్గం నుంచి సురేఖ ఔట్?… వరంగల్ తూర్పులో హై టెన్షన్..









