
Irumudi : మక్తల్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి ప్రేక్షకాదరణతో దూసుకెళ్తున్న ఇరుముడి సినిమాను అర్ధాంతరంగా తొలగించడంతో స్థానిక వెంకటరమణ థియేటర్‌లో ప్రదర్శిస్తున్న ఈ చిత్రాన్ని బుధవారం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నిలిపివేయడంపై ప్రజలు, అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాను తిరిగి కొనసాగించాలంటూ థియేటర్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు.
ఇటీవల విడుదలైన ఇరుముడి సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. సినిమా చూడాలని చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు మక్తల్‌కు వస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండటంతో చాలామందికి టికెట్లు దొరకలేదు. నిన్న సొంత పనులన్నీ పక్కన పెట్టి మరీ థియేటర్‌కు వచ్చిన ఎంతోమంది ప్రేక్షకులు, టికెట్లు దొరక్క నిరాశతో వెనుదిరిగారు. చివరికి కనీసం కింద కూర్చుని అయినా సరే సినిమా చూస్తాం అని వేడుకున్నా ఫలితం లేకపోయింది.
ఇంతలో బుధవారం ఉదయం వచ్చి చూసేసరికి థియేటర్లో ఇరుముడి సినిమా స్థానంలో మరో సినిమాను ప్రదర్శిస్తుండటంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరో కొత్త సినిమా విడుదల కారణంగానే మంచి కలెక్షన్లతో నడుస్తున్న ఈ చిత్రాన్ని బలవంతంగా తొలగించారని భక్తులు మండిపడ్డారు. థియేటర్ యాజమాన్యం స్పందించి ప్రజలకు తగిన సమాధానం ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేయడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read : టాలీవుడ్ డైరెక్టర్ అరెస్ట్..? హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి..
ఇరుముడి సినిమా కోసం థియేటర్ ముందు జనం ధర్నా!!
మక్తల్, తెలంగాణ:
“ఇరుముడి” సినిమాను థియేటర్ నుంచి బుధవారం తీశారు. వెంకటరమణ థియేటర్‌కు పలు గ్రామాల ప్రజలు రావడం, ఇరుముడి సినిమా లేకపోవడంతో ప్రజలు సినిమా థియేటర్ ముందు కూర్చుని ఇరుముడి సినిమాను కొనసాగించాలని భక్తులు, ప్రజలు ధర్నా… pic.twitter.com/90lNSnHki1
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) August 26, 2026
మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఆగస్టు 21న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా మల్లెపూల పల్లకి పాట, డివోషనల్ ట్రాక్ ప్రేక్షకులకు మంచి ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తాయి.
Also Read : భర్త చనిపోతే బొట్టు.. గాజులు తీసేయాలా.. నటి అనసూయ సంచలన వ్యాఖ్యలు









