Saturday, June 13, 15:50
32.5 C
Hyderabad

Peddi Collections: బాక్సాఫీస్ దుమ్మురేపుతున్న ‘పెద్ది’.. ఫస్ట్ వీక్ కలక్షన్ల సునామి!

Peddi Collections
Peddi Collections

Peddi Collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చి బాబు సానా తెరకెక్కించిన ‘పెద్ది’ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంటోంది. గ్రామీణ క్రీడల నేపథ్యంలో రూపొందిన ఈ భారీ పాన్ ఇండియా చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది.

సినిమా విడుదలై తొలి వారం పూర్తి కావడంతో చిత్ర బృందం అధికారికంగా బాక్సాఫీస్ వసూళ్ల వివరాలను ప్రకటించింది. వారి సమాచారం ప్రకారం, ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలోనే రూ.345 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. విడుదలకు ముందు, తర్వాత కొన్ని చిన్న సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ స్థాయి వసూళ్లు రావడం సినిమా విజయానికి నిదర్శనంగా నిలిచింది.

Also Read: ‘పెద్ది’లో ఆ సీన్స్ అన్ని కట్.. రీ ఎడిట్ వెర్షన్ రిలీజ్ ఎప్పుడంటే..?

సినిమా విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిర్మాతలు కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో టికెట్ ధరలను తగ్గించారు. దీంతో కుటుంబ ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు వచ్చే అవకాశం ఏర్పడింది. అలాగే మొదట సినిమా నుంచి తొలగించిన కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను త్వరలో థియేటర్లలో జోడించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు మరోసారి థియేటర్లకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో రామ్ చరణ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో మెప్పించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను వృద్ధి సినిమాస్ నిర్మించింది. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం కూడా సినిమాకు మరింత బలం చేకూర్చాయి.

ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లతో కొనసాగుతున్న ‘పెద్ది’ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.