White House : అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన కేటీ జకారియా కేవలం ఐదు రోజుల్లోనే తన పదవి నుంచి తప్పుకున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనల మేరకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు.

Also Read : ట్రంప్‌కు వరుస షాకులు.. ట్రూత్ సోషల్‌కు తగ్గుతున్న క్రేజ్!

ట్రంప్ సూచనతోనే ఎగ్జిట్

ప్రెస్ సెక్రటరీగా చేరినప్పటి నుంచి కేటీ జకారియా విమర్శలను ఎదుర్కొంటున్నారు. శుక్రవారం వైట్‌హౌస్ విలేకరులతో మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్.. మీడియా ఆమె పట్ల అన్యాయంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యోగంపై మరోసారి పునరాలోచించుకోవాలని స్వయంగా తానే ఆమెకు సలహా ఇచ్చినట్లు చెప్పారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన కేటీ, ట్రంప్ నాయకత్వంలో పనిచేయడం తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఆయన దయగల, కష్టపడే మనస్తత్వం ఉన్న నాయకుడని ప్రశంసించారు.

Also Read : ఇరాన్‌పై ‘Mother Of All Bombs’? అమెరికా ‘MOAB’ వెనుక అసలు కథ

వివాదాలు, విమర్శల పర్వం

అక్టోబర్ 10న బాధ్యతలు స్వీకరించిన కేటీ, తన తొలి ప్రెస్ బ్రీఫింగ్‌లోనే తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. కేవలం ట్రంప్‌కు అనుకూలంగా ఉండే మూడు మీడియా సంస్థల ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చి, 14 నిమిషాల్లోనే ప్రెస్‌మీట్‌ను ముగించడం విమర్శలకు దారితీసింది. అంతేకాకుండా, ఆమె న్యాయశాస్త్ర అర్హతలపై (లా డిగ్రీ) సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. గతంలో టీవీ చర్చల్లో న్యాయవాదిగా వ్యవహరించిన ఆమె, యూఎస్‌లో ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన ‘బార్ ఎగ్జామ్’లో ఉత్తీర్ణత సాధించలేదని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించారు. ఆరు సంవత్సరాల్లో నలుగురు పిల్లలు పుట్టడంతో న్యాయవాద ప్రాక్టీస్ వైపు వెళ్లాలనే ఆలోచన చేయలేదని ఆమె స్పష్టం చేశారు.