
Dolphine Typhoon : చైనాలో డాల్ఫిన్ తుపాను గడగడలాడిస్తోంది. ఈ తుపాను ఆదివారం మధ్యాహ్నం చైనా తూర్పు తీరం లోని జెజియాంగ్ ప్రావిన్స్‌ను తాకడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. తుపాను మూలంగా షాంఘై లోని రెండు ప్రముఖ విమానాశ్రయాల్లో దాదాపు 2 230 విమానాలను రద్దు చేశారు . అందులో 720 విమానాలు సోమవారం రాత్రి వరకు రద్దు చేశారు. దానితో పాటు హాంగ్‌జావ్ నగరంలోని విమానాశ్రయంలో రాకపోకలు సాగించాల్సిన దాదాపు 500 విమానాలను అధికారులు రద్దు చేయడం విశేషం.ఈ సంవత్సరం చైనాలో సంభవించిన తుపానుల్లో ఇది 13 వది కావడం గమనార్హం. తుపాను తాకిడి తీవ్రంగా ఉండటంతో చైనా జాతీయ వాతావరణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించాల్సి వచ్చింది. ఈ తుపానుల మూలంగా గాలులు ఒక సెకనుకు 42 మీటర్ల వేగంతో వీస్తున్నాయి. కాగా, తుపాను తీవ్రత మూలంగా జెజియాంగ్ ప్రావిన్స్ ప్రాంతంలోని తీర ప్రాంతాల్లో ఉన్న లక్షల మంది జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పించారు. అవసరమైన సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నారు.
Also Read : రష్యాపై ఉక్రెయిన్ భారీ దాడి.. 12 మంది మృతి.. 39 మందికి గాయాలు
Flash floodwater surged against thick, reinforced glass, holding back tons of water following Typhoon Dolphin yesterday in Wenzhou, Zhejiang Province, eastern China. pic.twitter.com/6y23zPlaaN
— Weather Monitor (@WeatherMonitors) August 10, 2026
అంత్యంత శక్తివంతమైన డాల్ఫిన్ తుపాను తీరాన్ని తాకడంతో ఆ ప్రాంతం చిగురుటాకుల వణుకుతోంది. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడటంతో పాటు, వరదలు పోటెత్తే ప్రమాదం ఉందన్న కారణంగా తీరప్రాంత నగరాల్లోని దాదాపు 10లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. జెజియాంగ్ ప్రావిన్స్‌లో 1,500కు పైగా తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : భారత్, అమెరికా సంబంధాల్లో మరో టెన్షన్… ఇండియాపై 100 శాతం టారిఫ్ ?
The strength of White Dolphin Typhoon, China pic.twitter.com/bIn3NljDNa
— Reels (@benditochicas) August 10, 2026
షాంఘై నగరంలో గత 24 గంటల వ్యవధిలో దాదాపు 313 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. కాగా, గత 150 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధిక వర్షపాతమని అధికారులు వివరించారు. వందకు పైగా వీధులు జలమయం అవ్వడంతో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు వారికి హెచ్చిరికలు జారీ చేశారు. కొండచరియలు విరిగిపడడంతో పలు ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాల్లో రాకపోకలు నిలిపివేశారు. చైనాలోని డాల్ఫిన్ తుపాను ప్రభావం తైవాన్, భారత్‌లపైనా పడే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. దీనివల్ల చైనా సరిహద్దుల్లో ఉన్న భారత భూభాగంలోలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.









