
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మీడియా సంస్థ ట్రూత్ సోషల్‌లో మాజీ కమ్యూనికేషన్స్ సలహాదారుగా పనిచేసిన కేటీ జకారియా(Katie Zacharia) ను తన కొత్త ప్రెస్ సెక్రటరీగా ఎంచుకున్నారు. ఆమె వైట్ హౌస్‌లో కరోలిన్ లెవిట్ స్థానాన్ని ఆమె భర్తీ చేయనున్నారు. గతవారం ట్రంప్ మాజీ న్యూస్ యాంకర్ బెన్నీ రే హార్మొనీని కమ్యూనికేషన్స్ బృందానికి అధికార ప్రతినిధిగా, సహాయ ప్రెస్ సెక్రటరీగా నియమించారు. అప్పటి నుండి ట్రంప్ ప్రెస్ సెక్రటరీగా ఎవరిని నియమిస్తారని ప్రశ్నలు మొదలయ్యాయి. తాజాగా ట్రంప్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియాను నియమించి అందరినీ షాక్‌కు గురిచేశారు. అయితే ట్రంప్ కేటీని తన నమ్మకమైన మద్దతుదారు అని పేర్కొంటూ ఆమె పేరును ప్రకటించారు. ఇకపై అమెరికా అధ్యక్షుడి సందేశాన్ని కేటీ దేశ ప్రజలకు తెలియజేయనున్నారు.
New White House Press Secretary Katie Zacharia:
“The abortion pill has the same chemicals that they used in the extermination camps in Nazi Germany” https://t.co/N0I7XzDWkz
— HOT SPOT (@HotSpotHotSpot) October 10, 2026
Also Read : బ్రెజిల్‌ను కుదిపేస్తున్న జెన్-జీ విప్లవం.. వీధుల్లోకి వేలాది మంది విద్యార్థులు.. అసలు కారణమిదే!
కేటీ జకారియాస్ ఎవరు?
కేటీ ప్రస్తుతం ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌లో సీనియర్ కమ్యూనికేషన్స్ సలహాదారుగా పనిచేస్తున్నారు. ఈ సంస్థే అధ్యక్షుడి ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌ను నడుపుతోంది. కేటీ ఫాక్స్ న్యూస్, న్యూస్మాక్స్లో రాజకీయ వ్యాఖ్యాతగా కూడా పనిచేశారు. ఆమె యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. కేటీ గతంలో యునైటెడ్ స్టేట్స్లో వలసల అమలును పర్యవేక్షించే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీకి కొంతకాలం అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఆమె ఈ ఏడాది ప్రారంభంలో అప్పటి సెక్రటరీ క్రిస్టీ నోమ్ హయాంలో ఆ విభాగంలో చేరారు. కానీ రెండు నెలల తర్వాత ఆమె ఆ పదవిని వదిలేశారు. అలాగే జకారియా ట్రంప్‌కు మిత్రుడైన రిచర్డ్ గ్రెనెల్ స్థాపించిన ఫిక్స్ కాలిఫోర్నియా అనే ప్రచార బృందంతో కూడా పనిచేశారు. ఆయన ట్రంప్ ప్రత్యేక అధ్యక్ష రాయబారులలో ఒకరు.
అయితే కేటీ అధ్యక్ష ఎన్నికల ప్రచారాల సమయంలో కూడా విస్తృతంగా పనిచేశారని ట్రంప్ ప్రశంసించారు. వైట్ హౌస్ ప్రెస్ కార్ప్స్‌తో ఆమెకు మంచి సంబంధాలు ఉంటాయని ట్రంప్ అన్నారు. ట్రంప్ తన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమాన్ని కూడా ప్రస్తావిస్తూ ఆమె MAGAకు అంకితభావం గల అభిమాని, సభ్యురాలు అని పేర్కొన్నారు. అయితే 29 ఏళ్ల లెవిట్ ఆగస్టులో ప్రెస్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. ట్రంప్ ఆమెను నియమించినప్పటికీ ఫస్ట్ ఎంపిక ఆమె కాదు. ట్రంప్ మొదట ఈ పదవిని ఫాక్స్ న్యూస్ జాతీయ కరస్పాండెంట్ అలెక్సిస్ ఆడమ్స్కు ఆఫర్ చేశారు. కానీ చివరకు కేటీ జకారియా ట్రంప్ ప్రత్యేక బాధ్యతలు అందించారు. కేటీ జనరల్ కౌన్సెల్‌గా పనిచేశారు. పెప్పర్డైన్ యూనివర్సిటీ లా స్కూల్ నుంచి పట్టభద్రురాలై రిపబ్లికన్ రాజకీయాలలో తన వృత్తిని ప్రారంభించారు. ఆమె 2006లో రిపబ్లికన్ నేషనల్ కమిటీలో ఇంటర్న్‌గా కూడా పనిచేశారు.
జనవరి 2025లో ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కరోలిన్ లీవిట్ ప్రెస్ సెక్రటరీ పదవిని చేపట్టారు. ట్రంప్‌కు గట్టి మద్దతుదారురాలైన లీవిట్ గతంలో ఆయన 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ప్రెస్ సెక్రటరీగా పనిచేశారు. రెండో బిడ్డ పుట్టిన తర్వాత ఆమె ఈ పదవిని ఆగస్టులో వదిలారు. దీంతో ఆ పదవి ఖాళీ అయింది. అప్పుడు ట్రంప్ కేటీ జకారియాకు ఆఫర్ ఇచ్చారు.
Also Read : ఇరాన్ మిలిటరీ మనీ రూట్‌పై యుఎస్ అటాక్.. బ్లాక్‌లిస్ట్‌లో ముంబై బిజినెస్‌లు









