Switzerland shooting : స్విట్జర్లాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. అక్కడ జరిగిన ఓ రేవ్ పార్టీలో కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందడంతో పాటు.. ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

ఈ రోజు తెల్లవారుజామున ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జూరిచ్‌లోని ఆరావులో శనివారం రాత్రి ఇక్కడ భారీ రేవ్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో సుమారు 3500 మంది వరకు పాల్గొన్నారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ, ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి పార్టీలో ఉన్న వారిపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు.

ఆ వ్యక్తి కాల్పుల అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయడినట్లు పోలీసుల తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ పలువురిని ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితుడి కోసం ఆర్గావ్ కాంటోనల్ పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుని కోసం సైనిక హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించడంతో పాటు, ఘటనా స్థలానికి సుదూర ప్రాంతాల్లోనూ సాయుధ పోలీసులను అప్రమత్తం చేశారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.