అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ తగిలింది. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది భారతీయ ములాలు ఉన్న దక్షిణ ఆఫ్రికాకు చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతమ్ పిళ్లైకి దక్కింది. అంతర్జాతీయ చట్టాల బలోపేతానికి, మానవ హక్కుల రక్షణకు నిరంతరం శ్రమించిన ఆమెను ఈ ఏడాది నోబెల్ బహుమతి వరించింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో భారతీయ తమిళ మూలాలున్న కుటుంబంలో నవనీతమ్ పిళ్లై జన్మించారు. దక్షిణ ఆఫ్రికాలో మొదటి మహిళ న్యాయవాది కూడా ఈమెనే. నాటి వర్ణవివక్ష పాలనలో రంగు ఆధారిత అసమానతలు, సామాజిక బహిష్కరణలను ఆమె దగ్గరి నుంచి చూశారు. న్యాయవాదిగా మారిన ఆమె, వర్ణవివక్షకు వ్యతిరేకంగా గళమెత్తిన అగ్రనేత నెల్సన్ మండేలాతో పాటు అనేకమంది ఉద్యమకారుల తరఫున కోర్టుల్లో వాదించారు. అణచివేత నిర్మూలనకు తన వృత్తి ద్వారా మొదటి నుంచీ గట్టి పునాది వేశారు.

Also Read : ఎన్నికల వేళ ఇండియన్స్‌కు ట్రంప్ బిగ్ షాక్.. వారి ఓట్లే టార్గెట్.. ఎందుకు?

Also Read : అమెరికా మాట వినని ఇరాన్.. దాడులు చేసినా మళ్లీ అదే పని!

పిళ్లై అంతర్జాతీయ చట్టాల పరిధిని వాటి ప్రభావాన్ని ఎంతగానో విస్తరించారు. దక్షిణాఫ్రికా హైకోర్టు న్యాయమూర్తిగా, రువాండా అంతర్జాతీయ నేర విచారణ ట్రిబ్యునల్, అంతర్జాతీయ నేరాల కోర్టులలో జడ్జీగా నవనీతమ్ పిళ్ల్లై సేవలు అందించారు. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే ఘోరమైన నేరాలకు శిక్షలు ఖాయమని చాటిచెప్పడంలో ఆమె ముఖ్య పాత్ర వహించారు. ఆ తర్వాత ఆమె 2008 నుంచి 2014 వరకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా జరిగే హక్కుల ఉల్లంఘనలపై నిలదీశారు. ఇటీవలి వరకు ఆక్రమిత పాలస్తీనా భూభాగాలపై ఐరాస విచారణ కమిషన్ చైర్‌పర్సన్‌గానూ వ్యవహరించారు. ప్రస్తుతం మయన్మార్‌లో జరిగిన జెనోసైడ్ ఆరోపణల కేసును విచారిస్తున్న అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆమె జడ్జీగా ఉన్నారు. చట్టపరమైన మార్గాల ద్వారా యుద్ధాలు, హింసలను అడ్డుకోవచ్చని నావి పిళ్లై తన తీర్పుల ద్వారా నిరూపించారు. అంతర్జాతీయ న్యాయవ్యవస్థ బలోపేతానికి, యుద్ధ నేరాలపై న్యాయపరమైన చర్యలకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కినట్లు పేర్కొన్నారు.