
Lamborghini Urus : దుబాయ్‌లోని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఊహించని అదృష్టాన్ని సొంతం చేసుకుంది. కంపెనీ మూడవ వార్షికోత్సవం, అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో భాగంగా అద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకు ఆమెకు కోట్లు విలువ చేసే ఖరీదైన లగ్జరీ కారును బహుమతిగా అందించారు. కేవలం సాధారణ ట్రోఫీని అందుకుంటున్నానని భావించిన ఆ ఉద్యోగికి కంపెనీ సీఈఓ ఇచ్చిన ఈ భారీ సర్ప్రైజ్ చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు.
దుబాయ్‌లోని రిచ్కీ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ సంస్థ మూడవ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో కంపెనీ సీఈఓ దబన్ ఓత్మాన్ సంస్థ తరఫున అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలోనే నటాలియా చావెజ్ అనే ఉద్యోగిని 2026 సంవత్సరపు ఉత్తమ ప్రదర్శకురాలిగా ఎంపిక చేశారు. తన పేరు ప్రకటించడంతో నటాలియా ఎంతో సంతోషంగా వేదికపైకి వెళ్లి ట్రోఫీని అందుకుంది. అవార్డు తీసుకుని తన సీటుకు వెళ్లిపోదామని భావిస్తున్న తరుణంలో సీఈఓ ఆమెను ఆపి అసలు సర్ప్రైజ్ ఇక్కడే మొదలవుతుందని చెప్పారు.
Also Read : ఇజ్రాయెల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. కూలిపోతున్న నెతన్యాహు కోటలు… కింగ్మేకర్లుగా అరబ్ నేతలు!
📹 No Sweets or Dry Fruits: Dubai Company Goes Viral After Gifting Top Employee A Lamborghini 🤯
To be fair, it was given to an agent who reportedly closed over $500mn in sales for the real estate company.
What did your company gift you for this Diwali?
📹 Richkey_properties / IG
— RT_India (@RT_India_news) October 30, 2026
నటాలియా ఆశ్చర్యపోతుండగానే వేదికపై కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఆ తర్వాత అక్కడే కప్పబడి ఉన్న రిబ్బన్‌ను తొలగించగా నీలి రంగు లంబోర్ఘిని ఉరస్ కారు అందరి కళ్ల ముందు ప్రత్యక్షమైంది. దీన్ని చూసిన నటాలియా ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆమె నమ్మలేక ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరైంది. కొద్ది క్షణాల క్రితం కేవలం చిన్న ట్రోఫీ మాత్రమే వస్తుందని అనుకున్న ఆమెకు ఏకంగా రూ.40 మిలియన్ల (సుమారు రూ. 4 కోట్ల పైచిలుకు) విలువైన లగ్జరీ కారు బహుమతిగా లభించడంతో ఆమె ఆనంద భాష్పాలు ఆపుకోలేకపోయింది.
నటాలియాకు ఈ అరుదైన బహుమతి ఊరికే రాలేదు. దాని వెనుక ఆమె రెండేళ్ల కఠిన శ్రమ దాగుంది. గత రెండు సంవత్సరాల కాలంలో ఆమె ఏకంగా 500 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఆస్తి ఒప్పందాలను విజయవంతంగా పూర్తి చేసింది. కంపెనీలో మొదటి త్రైమాసికంలో మూడవ స్థానంలో నిలిచిన ఆమె, ఆ తర్వాత రెండు, మూడు త్రైమాసికాల్లో తన పనితీరును మరింత మెరుగుపరుచుకుని అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ అసాధారణ ప్రతిభే ఆమెను సంస్థలో నంబర్ వన్ ఉద్యోగిగా నిలబెట్టింది. ఈ ఒక్క రాత్రే ఆమె లంబోర్ఘిని కారుతో పాటు మరో నాలుగు ప్రధాన అవార్డులను కూడా సొంతం చేసుకుని తన కెరీర్లో చిరస్మరణీయమైన రికార్డు సృష్టించింది.
దుబాయ్‌లో ఈ లగ్జరీ కారు ధర దాని మోడల్, ఫీచర్లను బట్టి దాదాపు 900,000 నుండి 15,50,000 దిర్హమ్ల వరకు ఉంటుంది. భార తీయ కరెన్సీలో ఇది సుమారు 23 మిలియన్ల నుండి 40 మిలియన్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఒక ఉద్యోగి సాధించిన అద్భుతమైన విజానానికి కంపెనీ ఏకంగా కోట్లలో బహుమతి ఇవ్వడాన్ని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు.
Also Read : స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 64 మంది మృతి









