CODE 100 In Iran
CODE 100 In Iran

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒకవైపు ఇరాన్(Iran) సైనిక కదలికలపై షాకింగ్ రిపోర్టులు.. మరోవైపు సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల క్షిపణి, డ్రోన్ దాడులు.. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాంప్ డేవిడ్ పర్యటనను షెడ్యూల్ కంటే ముందే ముగించుకుని వైట్ హౌస్‌కు తిరిగి రావడం.. ఈ 3 పరిణామాలు ఒకేసారి జరగడంతో అందరికీ ఓ డౌట్ వస్తోంది. ఇరాన్ నిజంగానే “కోడ్ 100”(Code 100) యాక్టివేట్ చేసిందా? ఒకవేళ ఈ వార్త నిజమైతే.. ఇది నార్మల్ మిలిటరీ అలర్ట్ కాదు. ఇరాన్ తన సైన్యాన్ని అత్యంత అప్రమత్త స్థాయిలోకి తీసుకెళ్లిందన్న సంకేతం. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. “కోడ్ 100” పేరుతో అధికారికంగా ఇరాన్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అందుకే ఇది కన్ఫర్మ్డ్ మిలిటరీ ఆర్డరా? లేక ఇంటెలిజెన్స్, OSINT రిపోర్ట్స్ ఆధారంగా బయటకు వచ్చిన సమాచారమా? అనేది ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదు. అయితే అసలు విషయం ఏంటో ఇప్పుడు స్టెప్-బై-స్టెప్ చూద్దాం.

సాధారణంగా ఒక దేశం మిలిటరీ అలర్ట్ పెంచిందంటే.. సరిహద్దుల్లో సర్వైలెన్స్ పెంచడం, ట్రూప్స్‌ను రెడీగా ఉంచడం లాంటి చర్యలు ఉంటాయి. కానీ కోడ్ 100 గురించి వస్తున్న నివేదికలు మాత్రం దీన్ని మ్యాక్సిమం మిలిటరీ రెడీనెస్‌గా వివరిస్తున్నాయి. అంటే పరిస్థితి మరింత తీవ్రమైతే.. సైన్యం వెయిట్ చేయకుండా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నట్లు. ఇరాన్‌లో ప్రధానంగా రెండు మిలిటరీ స్ట్రక్చర్స్ ఉన్నాయి.

ఒకటి అర్తేష్ అంటే రెగ్యులర్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్. మరొకటి ఐఆర్‌జిసి ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్‌ప్స్. ఈ రెండు వ్యవస్థలతో పాటు ఎయిర్ డిఫెన్స్, సెక్యూరిటీ ఫోర్సెస్ వంటి విభాగాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కోడ్ 100 నిజంగానే అమల్లోకి వచ్చి ఉంటే.. ఈ బలగాలు మరింత హై-అలర్ట్‌లోకి వెళ్లి ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే “ఆర్డర్ వస్తే వెంటనే యాక్షన్” అనే మైండ్‌సెట్. కోడ్ 100కు సంబంధించిన ఈ స్పెసిఫిక్ డిటైల్స్‌ను ఇరాన్ అధికారికంగా ధృవీకరించలేదు. మరి ఇప్పుడే ఈ కోడ్ 100 వార్త ఎందుకు వచ్చింది? దానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది యెమెన్‌లోని హౌతీ ఫైటర్స్, సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న ఘర్షణ. ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న హౌతీ దళాలు సౌదీ అరేబియాపై మిస్సైల్, డ్రోన్ అటాక్స్‌కు పాల్పడ్డాయని సౌదీ చెబుతోంది. ఇటీవల రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ మిస్సైల్ దాడి ప్రయత్నం జరిగినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. హౌతీ వర్గాలు కూడా రియాద్, సౌదీ ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను లక్ష్యంగా చేసుకున్న దాడుల గురించి ప్రకటించాయి. ఇక్కడ ఒక విషయం చాలా కీలకం. రియాద్ అంటే కేవలం ఒక క్యాపిటల్ సిటీ కాదు. అది సౌదీ అరేబియా పొలిటికల్, ఎకనామిక్ నెర్వ్ సెంటర్. అందుకే అక్కడ మిస్సైల్ అటాక్ అటెంప్ట్ జరిగిందంటే.. అది సౌదీ అరేబియాకే కాదు, మొత్తం గల్ఫ్ రీజియన్‌కు తీవ్రమైన భద్రతా ఆందోళన. హౌతీ ఫోర్సెస్ యెమెన్‌లో తమ ప్రభావాన్ని విస్తరించడంతో సౌదీ-బ్యాక్డ్ ఫోర్సెస్‌తో ఘర్షణ మరింత తీవ్రమైంది. దీనివల్ల రెడ్ సీ, బాబ్ ఎల్-మండేబ్ వంటి కీలక ప్రాంతాలపై కూడా ఆందోళనలు పెరిగాయి.

Also Read : శత్రువుల గోడను బద్దలు కొట్టిన పుతిన్.. పార్లమెంట్‌లో 355 సీట్లు.. కోలుకోని ట్రంప్!

సౌదీ అరేబియా అమెరికాకు కీలక రీజినల్ పార్ట్‌నర్. అదే సమయంలో హౌతీస్‌ను వాషింగ్టన్, ఇరాన్-బ్యాక్డ్ గ్రూప్‌గా చూస్తోంది. అందుకే సౌదీపై అటాక్స్ పెరగడం అంటే.. ఇరాన్–హౌతీ–సౌదీ ఈక్వేషన్‌లో అమెరికా కూడా ఇండైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవుతున్నట్టే. ఈ పరిస్థితుల్లో యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అమెరికన్లకు సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది. ప్రాంతంలో పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉందని.. ఫ్లైట్ క్యాన్సిలేషన్స్, ట్రావెల్ డిస్రప్షన్స్, ఎయిర్‌స్పేస్ రెస్ట్రిక్షన్స్ వంటి పరిణామాలకు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఇరాన్ విషయంలో అమెరికా ట్రావెల్ అడ్వైజరీ ఇప్పటికే లెవెల్ 4 “డూ నాట్ ట్రావెల్”గా ఉంది. అక్కడ ఉన్న యుఎస్ సిటిజన్స్ వెంటనే బయటకు రావాలని స్టేట్ డిపార్ట్‌మెంట్ సూచిస్తోంది.

డొనాల్డ్ ట్రంప్ వీకెండ్‌లో క్యాంప్ డేవిడ్‌లో ఉన్నారు. అయితే ఆయన ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే ముందుగానే వైట్ హౌస్‌కు తిరిగి వచ్చారు. ఇది హౌతీ అటాక్, రీజినల్ టెన్షన్స్ పెరుగుతున్న టైంలో జరగడంతో అనేక సందేహాలు వస్తున్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ మీటింగ్ జరిగిందా? ఇరాన్ విషయంలో కీలక డిసిషన్ తీసుకోబోతున్నారా? లేక రీజినల్ మిలిటరీ సిచువేషన్‌పై బ్రీఫింగ్ వచ్చిందా? ఇలాంటి ఊహాగానాలు మొదలయ్యాయి. వైట్ హౌస్ ట్రంప్ ఎర్లీ రిటర్న్‌కు రీజన్ కన్ఫర్మ్ చేయలేదు. కాబట్టి “ఇరాన్‌పై అటాక్ కోసం ట్రంప్ తిరిగొచ్చారు” అని ఖచ్చితంగా చెప్పడానికి ఆధారం లేదు. అయితే టైమింగ్ మాత్రం అటెన్షన్ గ్రాబ్ చేసింది.

మరి ఇరాన్‌లో నిజంగా ఏం జరుగుతోంది? ఇదే అసలు మిలియన్-డాలర్ క్వశ్చన్. కోడ్ 100 రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఇరాన్ మిలిటరీ మూవ్‌మెంట్స్‌పై కూడా చర్చ మొదలైంది. మిస్సైల్ యూనిట్స్, ఎయిర్-డిఫెన్స్ సిస్టమ్స్, మిలిటరీ బేసెస్, కమాండ్ స్ట్రక్చర్స్ వంటి అంశాల్లో రెడీనెస్ పెరిగిందా? అన్నది పరిశీలకులు గమనిస్తున్నారు. ఇరాన్‌కు ఇప్పటికే బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్స్, ఎయిర్-డిఫెన్స్ సిస్టమ్స్‌తో కూడిన పెద్ద మిలిటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అందుకే ఇరాన్ మ్యాక్సిమం రెడీనెస్‌లోకి వెళ్తే.. దాని ఇంపాక్ట్ కేవలం ఇరాన్ బార్డర్స్‌కే పరిమితం కాదు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యుఎస్ మిలిటరీ బేసెస్, గల్ఫ్ కంట్రీస్, షిప్పింగ్ రూట్స్.. అన్నింటిపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే “కోడ్ 100” అనే పదం బయటకు రావడమే రీజినల్ మార్కెట్స్, ఎయిర్‌లైన్స్, గవర్నమెంట్స్‌కు పెద్ద వార్నింగ్ సిగ్నల్‌గా కనిపిస్తోంది.

కోడ్ 100 గురించి సోషల్ మీడియా, OSINT నెట్‌వర్క్స్, రీజినల్ ఛానెల్స్‌లో చాలా వార్తలు తిరుగుతున్నాయి. కానీ ఇరాన్ ఆఫీషియల్ గవర్నమెంట్ మీడియా ఈ కోడ్ యాక్టివేషన్‌ను ప్రకటించలేదు. ఇరాన్ మిలిటరీ సంసిద్ధత పెరిగింది. ఒకవేళ కోడ్ 100 నిజంగానే యాక్టివేట్ అయితే? అప్పుడు మిలిటరీ ఫోర్సెస్ ఎక్కువ రెడీనెస్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ట్రూప్స్ ర్యాపిడ్ డిప్లాయ్‌మెంట్‌కు సిద్ధం కావచ్చు. ఎయిర్-డిఫెన్స్ సర్వైలెన్స్ పెరగవచ్చు. మిస్సైల్ ఫోర్సెస్ రంగంలోకి దిగవచ్చు. మిలిటరీ కమ్యూనికేషన్స్ మరింత యాక్టివ్ కావచ్చు. స్ట్రాటజిక్ లొకేషన్స్‌కు సెక్యూరిటీ పెంచవచ్చు.

Also Read : ఓ వైపు అమెరికా -ఇరాన్ మధ్య సమావేశం.. మరోవైపు హర్మూజ్ సమీపంలో పేలుళ్లు

ఇరాన్ నుంచి వచ్చే మిస్సైల్ థ్రెట్‌ను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్‌కు మల్టీ-లేయర్డ్ ఎయిర్-డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఐరన్ డోమ్, డేవిడ్స్ స్లింగ్, యారో వంటి సిస్టమ్స్ కీలకంగా పనిచేస్తాయి. అందుకే ఇరాన్ మిలిటరీ రెడీనెస్ పెరిగిందన్న రిపోర్ట్స్ వచ్చిన ప్రతిసారీ ఇజ్రాయెల్ కూడా తమ సెక్యూరిటీ పాశ్చర్‌ను రివ్యూ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక చైన్ రియాక్షన్లా మారొచ్చు. అదే ఇప్పుడు ప్రపంచ దేశాల ఆందోళన. గల్ఫ్ కంట్రీస్ ఎందుకు నెర్వస్‌గా ఉన్నాయి? సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ కంట్రీస్‌కు బిగ్గెస్ట్ ఆందోళన మిస్సైల్ అలాగే డ్రోన్ అటాక్స్ మాత్రమే కాదు. ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఎయిర్‌పోర్ట్స్. షిప్పింగ్ రూట్స్. ఎనర్జీ ఎక్స్‌పోర్ట్స్. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఏదైనా పెద్ద అంతరాయం జరిగితే.. దాని ప్రభావం మిడిల్ ఈస్ట్‌ను దాటి గ్లోబల్ ఎకానమీ వరకు వెళ్లొచ్చు. ప్రత్యేకంగా రెడ్ సీ, బాబ్ ఎల్-మండేబ్, పెర్షియన్ గల్ఫ్, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ లాంటి స్ట్రాటజిక్ రూట్స్‌లో అస్థిరత పెరిగితే ఆయిల్ ప్రైసెస్, షిప్పింగ్ కాస్ట్స్, ఇన్సూరెన్స్ కాస్ట్స్ అన్నీ ప్రభావితం కావచ్చు.

అందుకే ఇప్పుడు మిలిటరీ డెవలప్‌మెంట్స్‌తో పాటు ఏవియేషన్ నోటీసెస్, షిప్పింగ్ వార్నింగ్స్, ఎంబసీ అడ్వైజరీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్స్. ఇప్పుడు వెస్ట్ ఆసియాలో సిచువేషన్ చాలా డెలికేట్ స్టేజ్‌లో ఉంది. సౌదీ అరేబియా–హౌతీ కాన్ఫ్లిక్ట్ ఒక వైపు.. ఇరాన్–యుఎస్ టెన్షన్స్ మరోవైపు.. ఇజ్రాయెల్–ఇరాన్ కాన్‌ఫ్రంటేషన్ మరో పరిమాణం.. ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతున్నాయి. అందుకే “కోడ్ 100” నిజంగా యాక్టివేట్ అయిందా? అన్నదానికంటే కూడా.. ఇరాన్ మిలిటరీ ఎంతవరకు పెరిగింది? అమెరికా ఎలా రెస్పాండ్ అవుతుంది? ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? సౌదీ అరేబియా నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనేదే ఇప్పుడు ప్రపంచం ఎదురుచూస్తున్న అతిపెద్ద ప్రశ్న.