
Afghanistan : ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు భారత జాతీయ భూకంప కేంద్రం (NCS) తెలిపింది. రాత్రి 9.36 గంటలకు భూకంపం సంభవించిందని వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 147 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. భూకంప కేంద్రం 36.347 నార్త్ అక్షాంశం, 71.496 ఈస్ట్ రేఖాంశం వద్ద ఉన్నట్లు పేర్కొంది.
భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. ఆఫ్ఘనిస్థాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ముఖ్యంగా హిందూ కుష్ ప్రాంతం భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతం భూకంపాలకు చాలా సున్నితమైన ప్రాంతంలో ఉందని రెడ్‌క్రాస్ తెలిపింది.
EQ of M: 4.9, On: 30/08/2026 09:36:56 IST, Lat: 36.347 N, Long: 71.496 E, Depth: 147 Km, Location: Afghanistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @tummalasrini @GSuresh_NCS @ndmaindia pic.twitter.com/ZVC4LrN6e9— National Center for Seismology (@NCS_Earthquake) August 30, 2026
భారత్, యూరేషియా భూఫలకాల మధ్య ఢీకొనే ప్రాంతంలో ఆఫ్ఘనిస్థాన్ ఉండటమే దీనికి ప్రధాన కారణం. రెండు భూఫలకాలు ఒకదానిపై ఒకటి ఒత్తిడి చేయడం వల్ల అక్కడ తరచూ భూమి కంపిస్తుంటుంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని హెరాత్ ప్రాంతంతో పాటు మరికొన్ని ప్రాంతాల గుండా పెద్ద భూకంప పగులు కూడా వెళ్తోంది. దీంతో ఆ దేశంలో భూకంపాల ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.









