
తెలంగాణలో మహిళలకు మాత్రమే ఉన్న ఆ ఫ్రీ బస్ స్కీమ్ ఇక వృద్ధులకూ రాబోతుందా? 60 ఏళ్లు దాటిన ప్రతి సీనియర్ సిటిజన్‌కి బస్సు టికెట్ అవసరం ఉండదా? రాష్ట్రంలో ఆసుపత్రికి వెళ్లాలన్నా… బంధువుల ఇంటికి వెళ్లాలన్నా… పుణ్యక్షేత్రానికి వెళ్లాలన్నా… ఇక జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రయాణించే అవకాశం రాబోతోంది. అసలు ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? ఎవరికెవరికీ ఈ బెనిఫిట్ దక్కుతుంది? వయసు ఎంత ఉండాలి? ఇన్కమ్ లిమిట్ ఉంటుందా? ఎప్పటి నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది? ముఖ్యంగా… ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేస్తుండటంతో ఆర్టీసీపై భారీ ఫైనాన్షియల్ బర్డెన్ ఉంది. మరి ఇప్పుడు సీనియర్ సిటిజన్స్‌కూ ఫ్రీ జర్నీ ఇస్తే ఆ భారాన్ని ప్రభుత్వం ఎలా భరిస్తుంది? ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్.
తెలంగాణలో సీనియర్ సిటిజన్స్‌కి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక శుభవార్త ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో వయోవృద్ధులకు కూడా ఫ్రీ బస్ పాస్‌లు ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరగా సీనియర్ సిటిజన్స్‌కి కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. అంటే… ఇది ఇప్పటివరకు కేవలం సోషల్ మీడియాలో వచ్చిన వార్త కాదు. గవర్నమెంట్ లెవెల్లోనే దీనిపై డిస్కషన్ జరుగుతోంది. గవర్నమెంట్ ముందుగా కొన్ని కీలక అంశాలను ఫైనలైజ్ చేయాల్సి ఉంది. ఎవరిని సీనియర్ సిటిజన్‌గా పరిగణించాలి? 60 ఇయర్స్ కంప్లీట్ అయితే సరిపోతుందా? లేక వయసు పరిమితిని ఇంకా పెంచాలా? ఇన్కమ్ లిమిట్ పెట్టాలా? ప్రభుత్వ, ప్రైవేట్ బస్సుల్లోనా? ఆర్టీసీలోని అన్ని సర్వీసెస్‌కి వర్తింపజేయాలా? లేక కొన్ని బస్సెస్ కి మాత్రమే పరిమితం చేయాలా? ఇలాంటి అంశాలపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. అందుకే ఈ స్కీమ్ ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ఎవరికీ వస్తుంది? ఎలా వస్తుంది? అనే విషయాల్లో ప్రభుత్వం అఫీషియల్ గైడ్‌లైన్స్ విడుదల చేసే వరకు క్లారిటీ ఉండదు.
ఇది ఎందుకు అంత కీలకమైన నిర్ణయం అంటే… తెలంగాణలో సీనియర్ సిటిజన్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 2011 సెన్సస్ ప్రకారం రాష్ట్రంలో సుమారు 32.69 లక్షల మంది వృద్ధులు ఉన్నారు. కానీ ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య రాష్ట్ర జనాభాలో దాదాపు 12.5 శాతానికి చేరినట్లు అంచనా. అంటే సుమారు 48 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ తెలంగాణలో ఉన్నట్లు అంచనా. ఇక ముందు ఈ సంఖ్య మరింత పెరగబోతోంది. 2031 నాటికి వృద్ధుల వాటా సుమారు 14.5 శాతానికి, 2036 నాటికి 17.1 శాతానికి చేరే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. అంటే… ఈరోజు 48 లక్షలుగా కనిపిస్తున్న ఈ పాపులేషన్, రాబోయే సంవత్సరాల్లో ఇంకా పెద్ద సంఖ్యగా మారబోతోంది. అందుకే సీనియర్ సిటిజన్స్ కోసం ట్రాన్స్పోర్ట్ వంటి బేసిక్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతోంది. ఒక్కసారి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిందనుకోండి.. ముసలివాళ్లు ఆసుపత్రికి, బంధువుల ఇంటికి, పుణ్యక్షేత్రానికి వెళ్లాలన్నా టికెట్ కోసం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అంటే వయసు పెరిగే కొద్దీ పెరుగుతున్న ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ను ఈ స్కీమ్ తగ్గిస్తోంది. ముఖ్యంగా పెన్షన్ మీద ఆధారపడే ఎల్డర్లీ పీపుల్ కి ఇది పెద్ద రిలీఫ్ కావచ్చు.
ఇప్పటికే తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ అమల్లో ఉంది. 2023 డిసెంబర్ లో ఈ స్కీమ్ ప్రారంభమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మహిళలు ఆర్టీసీ బస్సెస్ ను ఉపయోగిస్తున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి బస్సెస్ లో ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. అయితే ఏసీ బస్సెస్, సూపర్ లగ్జరీ, కొన్ని ఇంటర్-స్టేట్ సర్వీసెస్, రాజధాని వంటి సర్వీసెస్ కు ఈ ఫ్రీ ట్రావెల్ వర్తించదు. సాధారణంగా మహిళలు తమ ఆధార్ కార్డ్ చూపించి మహాలక్ష్మి టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు ఇదే మోడల్ ను సీనియర్ సిటిజన్స్‌కి కూడా తీసుకురావాలా అనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే అదే ఎగ్జాక్ట్ రూల్స్ ఉంటాయా? లేక ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కోసం కొత్త రూల్స్ పెడతారా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇప్పుడు అందరి మైండ్ లో ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్… ఎంత వయసు ఉంటే ఈ ఫ్రీ బస్ పాస్ వస్తుంది? 60 ఇయర్స్? 65 ఇయర్స్? లేక 70 ఏళ్లా ? ఇదే ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అలాగే ఇన్కమ్ లిమిట్ ఉంటుందా లేదా అన్నది కూడా తెలియదు. ఉదాహరణకు… ఒక ధనిక వృద్దుడికి కూడా ఇదే బెనిఫిట్ ఇవ్వాలా? లేక ఎకనామికల్లీ వీకర్ ఎల్డర్లీ పీపుల్ కి మాత్రమే ఇవ్వాలా? అనే డిబేట్ కూడా ప్రభుత్వం ముందుంది. అందుకే ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఈ విషయాలన్నింటినీ ఎగ్జామిన్ చేసి గైడ్‌లైన్స్ ఫైనలైజ్ చేసిన తర్వాతే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే సీనియర్ సిటిజన్స్ కోసం తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తోంది. చేయూత పెన్షన్ కింద సుమారు 15.60 లక్షల మంది సీనియర్ సిటిజన్స్‌కి నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్ అందుతున్నట్లు సమాచారం. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు క్యాష్‌లెస్ మెడికల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. వృద్ధుల కోసం రాష్ట్రవ్యాప్తంగా డే కేర్ సెంటర్స్ కూడా పనిచేస్తున్నాయి. వృద్ధాశ్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జెరియాట్రిక్ కేర్ కోసం ట్రైనింగ్ ఇవ్వాలనే ప్రణాళికలు ఉన్నాయి. అలాగే ఎల్డర్ లైన్ 14567 ద్వారా వృద్ధుల సమస్యలపై అసిస్టెన్స్ అందిస్తున్నారు.
కానీ… ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఫ్రీ జర్నీ వినడానికి ఎంత బాగుందో… దాన్ని అమలు చేయడానికి అంతే ఖర్చు అవుతుంది. ఇప్పటికే మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ వల్ల ఆర్టీసీపై ఫైనాన్షియల్ బర్డెన్ ఉందనే చర్చ ఉంది. ఇప్పుడు దాదాపు 48 లక్షల సీనియర్ సిటిజన్స్‌కు కూడా ఫ్రీ ట్రావెల్ ఇస్తే… ఆర్టీసీపై అదనంగా ఎంత ఆర్థిక భారం పడుతుంది? రోజుకు ఎంతమంది ఎల్డర్లీ ప్యాసింజర్స్ ప్రయాణిస్తారు? వాళ్లు ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారు? ఎన్ని బస్సెస్ ఉపయోగిస్తారు? ఈ మొత్తం ఖర్చును గవర్నమెంట్ ఎలా భరిస్తోంది? ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే… ఫ్రీ టికెట్ ప్యాసింజర్ కి కావచ్చు… కానీ ఆర్టీసీకి మాత్రం అది పూర్తిగా ఫ్రీ కాదు. ఎక్కడో ఒకచోట ఆ ప్రయాణ ఖర్చును ప్రభుత్వం భరించాల్సిందే. అందుకే ఫైనాన్షియల్ ఇంపాక్ట్ కూడా ఈ డిసిషన్ లో చాలా కీలకం.
అందుకే ప్రభుత్వం ఒకేసారి అందరికీ అన్-లిమిటెడ్ ఫ్రీ ట్రావెల్ ఇస్తుందా? లేక కొన్ని కండిషన్స్ పెడుతుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఒక ఏజ్ లిమిట్ పెట్టొచ్చు. ఒక ప్రత్యేక బస్ పాస్ ఇవ్వొచ్చు. కొన్ని సర్వీసెస్ కి మాత్రమే ఫ్రీ ట్రావెల్ ఇవ్వొచ్చు. లేక పూర్తిగా మహాలక్ష్మి తరహాలో అన్ని ఎలిజిబుల్ ఆర్టీసీ సర్వీసెస్ లో ట్రావెల్ చేసే అవకాశం ఇవ్వొచ్చు. ఇక పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ సిటిజన్స్‌కి కొన్ని బస్ సర్వీసెస్ లో టికెట్ ఫేర్ పై రాయితీ ఉన్నట్లు చెబుతున్నారు. అక్కడ పూర్తిగా ఫ్రీ కాకుండా డిస్కౌంట్ మోడల్ ఉంది. కానీ తెలంగాణలో మాత్రం రాయితీ కాకుండా కంప్లీట్లీ ఫ్రీ ట్రావెల్ ఇవ్వాలనే ఆలోచన తెరపైకి వచ్చింది. అదే నిజంగా అమల్లోకి వస్తే… వృద్ధులకు ఇది చాలా పెద్ద ఊరట అవుతుంది.
హాస్పిటల్స్, ఫ్యామిలీ అవసరాలు, బంధువుల ఇళ్లు, పుణ్యక్షేత్రాలు… ఇలా రోజువారీ అవసరాల కోసం ప్రయాణించే లక్షలాది మంది వృద్ధులకు ఇది పెద్ద ఆర్థిక ఊరట అవుతుంది. ఒకవైపు మహిళలకు మహాలక్ష్మి ఫ్రీ ట్రావెల్… మరోవైపు సీనియర్ సిటిజన్స్‌కి ఫ్రీ బస్ పాస్… ఈ రెండు స్కీమ్స్ ను గవర్నమెంట్ ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ఆర్టీసీ ఆర్థిక భారాన్ని ఎలా మేనేజ్ చేస్తుంది? అదే ఇప్పుడు అసలు ఛాలెంజ్.









