
వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పించే లక్ష్యంతో సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’ నిర్వహించనున్నారు.
ఈ నెల 14, 15 తేదీలలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 14వ తేదీన ఉదయం 10:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇక ఇదే కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్ కూడా ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.
Also Read : పండుగలొచ్చాయ్: వారెవ్వా.. ఇలా చేస్తే ట్రైన్ టికెట్ కన్ఫార్మ్..! డోంట్ మిస్
వీరితో పాటుగా అదే రోజు సాయంత్రం 5 గంటలకు పద్మవిభూషణ్ కొణిదెల చిరంజీవి సైతం ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ గ్లోబల్ బిజినెస్ మీట్ ద్వారా దక్షిణ భారతదేశంలో పారిశ్రామిక పురోగతికి బాటలు వేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయిలో నూతన వ్యాపార భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం ప్రధాన ఉద్దేశం అని నిర్వహకులు పేర్కొన్నారు.
ముఖ్యంగా MSMEలు, స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేలా పలు కార్యక్రమాలను రూపకల్పన చేశారు. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు కొత్త మార్కెట్ల అన్వేషణకు ఈ వేదిక ఎంతో దోహదపడుతుందని నిర్వహకులు వెల్లడించారు. ఈ సదస్సు ఏర్పాట్లలో సమాఖ్య ప్రతినిధులు టీవీఎన్ రావు, పీవీ రావు, ఏవీ రత్నం, తోట చంద్రశేఖర్, రజనీకాంత్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read : నేటి నుంచే బతుకమ్మ సంబరాలు షూరు.. సద్దుల బతుకమ్మ ఎప్పుడంటే?









