NIMS : హైదరాబాద్‌లోని ప్రముఖ వైద్యరంగ సంస్థ నిజామ్స్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆగస్టు 13 నుండి చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక వైద్య సేవలను లండన్‌కు చెందిన ప్రముఖ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ తన్నషునేనితో పాటు సాంకేతిక నిపుణుల బృందం సహకారంతో నిమ్స్ కార్డియో థొరాసిక్ (CT) సర్జరీ విభాగం నిర్వహించనుందని పేర్కొంది. అ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ, CT సర్జరీ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్ అమరేశ్వర్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు. చిన్నారుల వైద్య అత్యవసర ప్రాధాన్యతను బట్టి ‘వాక్-ఇన్’ విధానంలో పరిశీలనలు జరుగుతాయని ఆయన వివరించారు.

Also Read : సీపీ సజ్జనార్‌పై సంచలన ఆరోపణలు.. డీజీపీకి సీబీఐ మాజీ డైరెక్టర్ లేఖ!

చిన్నారులకు అవసరమైన వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం శస్త్రచికిత్స అవసరం ఉన్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు వివరించారు. వివరాలకోసం సీటీ సర్జరీ విభాగం, మొదటి అంతస్తు, పాత బ్లాక్, నిమ్స్ ఆసుపత్రి, పంజాగుట్ట, హైదరాబాద్ నందు సంప్రదించాలని ఆయన కోరారు. సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. దీనికోసం ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేదని, చిన్నారులను తీసుకొచ్చేటప్పుడు పాత వైద్య నివేదికలు, పరీక్షా పత్రాలు (లభ్యతను బట్టి) వెంట తీసుకురావాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్: 040-2348-9025 లో సంప్రదించాలని కోరారు.

Also Read : అంగరంగ వైభవంగా లాల్‌దర్వాజా బోనాల పండుగ…శిగమూగుతున్న పాతబస్తీ

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.