
TSLPRB : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రేవంత్ సర్కార్ అదిరిపోయే తీపి కబురు అందించింది. రాష్ట్రంలో భారీ సంఖ్యలో పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో పాటు అనుబంధ విభాగాలలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 7,437 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ పూర్తిస్థాయిలో క్లియరెన్స్ ఇచ్చింది. మూడు రోజుల క్రితమే 5,000 పోస్టులకు ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఓకే చెప్పగా, నిరుద్యోగుల డిమాండ్ల నేపథ్యంలో తాజాగా అదనంగా మరో 2,437 పోస్టులను యాడ్ చేస్తూ మొత్తం ఖాళీల సంఖ్యను 7,437కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావడంతో నోటిఫికేషన్ల విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇప్పటికే సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
Also Read : కేటీఆర్ కన్నెపల్లి సందర్శనకు అడుగడుగున అడ్డంకులు… జాతీయ రహదారిపై హైడ్రామా
ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు? (జీవోల వారీగా వివరాలు)
ఈ మెగా రిక్రూట్‌మెంట్‌లో కేవలం పోలీస్ శాఖ మాత్రమే కాకుండా ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) లాంటి నాలుగు విభిన్న విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పోలీస్ శాఖ (జీవో నంబర్ 78): అత్యధికంగా 5,000 పోస్టులు.
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ – SPF (జీవో నంబర్ 84): సెక్యూరిటీ విభాగంలో 1,424 పోస్టులు.
ఫైర్ డిపార్ట్‌మెంట్ (జీవో నంబర్ 80): డిజాస్టర్ మేనేజ్‌మెంట్ & అగ్నిమాపక శాఖలో 790 పోస్టులు.
జైళ్ల శాఖ (జీవో నంబర్ 83): ఇంటిలిజన్స్ డిపార్ట్‌మెంట్‌లో 223 ఖాళీలు.
సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల పూర్తి వివరాలు
అభ్యర్థుల అవగాహన కోసం ఏయే విభాగంలో ఏయే పోస్టులు ఉన్నాయో బోర్డు స్పష్టమైన వివరాలను వెల్లడించింది.
1. పోలీస్ విభాగం:
సివిల్ కానిస్టేబుల్స్: 3,697 పోస్టులు
ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) కానిస్టేబుల్స్: 1,052 పోస్టులు
సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SI): 148 పోస్టులు
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (FPB): 23 పోస్టులు
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (AR): 14 పోస్టులు
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (TGSP): 12 పోస్టులు
డ్రైవర్ (PTO): 20 పోస్టులు
మెకానిక్ (PTO): 7 పోస్టులు
కానిస్టేబుల్ (SARCPL): 24 పోస్టులు
రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SARCPL): 3 పోస్టులు
2. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF):
కానిస్టేబుల్స్: 1,380 పోస్టులు
సబ్ ఇన్‌స్పెక్టర్స్: 44 పోస్టులు
3. ఫైర్ డిపార్ట్‌మెంట్:
ఫైర్ ఫైటర్స్: 751 పోస్టులు
స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్: 39 పోస్టులు
4. జైళ్ల శాఖ:
డిప్యూటీ జైలర్ (మెన్): 14 పోస్టులు
డిప్యూటీ జైలర్ (వుమెన్): 1 పోస్టు
వార్డర్ (మెన్): 196 పోస్టులు
వార్డర్ (వుమెన్): 12 పోస్టులు
అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పుడు?
అఫీషియల్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అనే దానిపై TSLPRB చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు స్పష్టతనిచ్చారు. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఆయా డిపార్ట్‌మెంట్ల హెడ్స్ నుంచి లోకల్ కేడర్ల వారీగా పోస్టుల డివిజన్, రోస్టర్ పాయింట్స్, క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ లాంటి సాంకేతిక వివరాలు బోర్డుకు అందాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే, కేవలం మరికొద్ది రోజుల్లోనే పూర్తి వివరాలతో కూడిన అఫీషియల్ నోటిఫికేషన్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, పరీక్ష తేదీలు, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలు వెల్లడవుతాయి.
Also Read : కవితకు ఈసీ బిగ్‌షాక్.. TRSపేరు ఔట్ ?
నిపుణుల సూచన:
నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందాం అనుకుంటే సమయం సరిపోదు. ఖాకీ యూనిఫామ్ వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ ప్రారంభించాలి. రాత పరీక్ష కోసం సిలబస్, కరెంట్ అఫైర్స్‌పై గ్రిప్ తెచ్చుకుంటూనే.. ఫిజికల్ ఈవెంట్స్ (రన్నింగ్, లాంగ్ జంప్) కోసం రోజువారీగా శారీరక దారుఢ్య పరీక్షల సాధన చేయడం చాలా ముఖ్యం.









