
CM Revanth Reddy : గత పాలకుల అరాచకం వల్ల విద్యాశాఖకు వందేళ్ల నష్టం జరిగిందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ విధ్వంసమైన విద్యాశాఖను తాము అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అండ్ వికాసం వైపు నడిపిస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్లాస్ రూమ్స్ నుండే తెలంగాణ అండ్ దేశ అభివృద్ధి మొదలవుతుందని నమ్మిన ప్రభుత్వం తమదని, అందుకే విద్యపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఒక పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నామని ఆయన చెప్పారు. పేద పిల్లలందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలనే ఉద్దేశంతోనే విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు.
ప్రభుత్వ మెయిన్ పాలసీ
తల్లిదండ్రుల కలలను సాకారం చేయడమే ఈ ప్రభుత్వ మెయిన్ పాలసీ అని సీఎం అన్నారు. ఇందుకోసం మొదటిసారిగా ప్రభుత్వ స్కూళ్లలో నర్సరీ విధానాన్ని కూడా అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూళ్లలో చేరడానికి విద్యార్థులు అస్సలు వచ్చేవాళ్లు కాదని, కానీ ఇప్పుడు తమ పాలనలో ఆరుట్లలోని ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు పెట్టే రేంజ్‌కు డిమాండ్ పెరిగిందని సీఎం రేవంత్ చెప్పారు. భవిష్యత్ తరాల బాగు కోసం విద్యపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నామని, ఈసారి స్టేట్ బడ్జెట్లో ఏకంగా 8.5% నిధులను విద్యకే కేటాయించామని గుర్తుచేశారు.
హాస్టల్ అండ్ రెసిడెన్షియల్ విద్యార్థుల ఇబ్బందులను తీరుస్తూ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లుగా పెంచకుండా పెండింగ్‌లో పెట్టిన డైట్ చార్జీలను తాము అధికారంలోకి రాగానే ఒకేసారి 40 శాతం పెంచి ఇస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా, విద్యార్థులకు ఇచ్చే కాస్మొటిక్ చార్జీలను ఏకంగా 200 శాతం పెంచినట్లు సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు. విద్యార్థుల అవసరాల కోసం నిధులు ఖర్చు చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ వెనకాడదని, నాణ్యమైన విద్యతోనే విద్యార్థుల ఫ్యూచర్ మారుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.









