IPL 2027 Mini Auction
IPL 2027 Mini Auction

ఐపీఎల్ క్రికెట్ ప్రియులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది 2027 సీజన్‌కు సంబంధించి మినీ వేలం తేదీ, వేదిక ఖరారు అయినట్లు తెలుస్తోంది. దాదాపు మూడేళ్ల తర్వాత భారతదేశంలో ఈ సారి IPL మినీ వేలం నిర్వహించనున్నట్లు సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం.. IPL 2027 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్ 16న గోవాలోని ఫేమస్ ఐటీసీ గ్రాండ్ హోటల్‌లో నిర్వహించనున్నారు. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.. ఫ్రాంచైజీల యజమానులు, సీఈఓలకు ఇంకా అధికారిక అందలేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఆ సమయానికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని బీసీసీఐ లాజిస్టిక్స్ టీమ్ జట్లకు వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపినట్లు సమాచారం.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వేలానికి సరిగ్గా ఒక్క రోజు ముందు అంటే డిసెంబర్ 15న అదే మినీవేలం వేదికపై ఫ్రాంచైజీలతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా IPL వేలాలు విదేశాల్లోనే జరుగుతున్న విషయం తెలిసిందే. 2023లో భారత్‌లో వేలం జరిగింది. ఆ తర్వాత 2024లో దుబాయ్, 2025లో జెడ్డా, 2026లో అబుదాబిలో వేలం నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత భారత్‌లో IPL వేలం జరగనుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది.