Horoscope 2026 Today
Horoscope 2026 Today

మేషం
పనుల్లో వేగం పెంచండి. తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పైసల విషయంలో జాగ్రత్త. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. శివుడిని పూజించండి.

వృషభం
టైమ్ చాలా బాగుంది. ధైర్యంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు. మంచి ఆదాయం, సమాజంలో గౌరవం లభిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామిని స్మరించుకోండి.

మిథునం
కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబంలో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి. దుర్గాదేవి స్తోత్రం చదవండి.

కర్కాటకం
పనులను వాయిదా వేయకుండా చేయండి. అధికారులతో మంచిగా ఉండండి. ఆర్థికంగా కలసివస్తుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించండి.

సింహం
బిజినెస్‌లో గుడ్ న్యూస్ వింటారు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టండి. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. సూర్య, కుజ ధ్యానం మేలు చేస్తుంది.

కన్య
ఆత్మవిశ్వాసంతో పని చేస్తే విజయం మీదే. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. చిన్న చిన్న కుటుంబ సమస్యలు ఉండవచ్చు. సూర్య నమస్కారాలు చేయండి.

Also Read : సైలెంట్‌గా సరిహద్దుల్లోకి వచ్చిన ‘మైటీ డ్రాగన్’.. రాబోయే రోజుల్లో భారత్‌కు ముప్పు తప్పదా?

తుల
ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో పనిచేస్తే మంచి పేరు వస్తుంది. పెద్దల సలహాలు పాటించండి. ఇష్టదైవాన్ని తలచుకోండి.

వృశ్చికం
లక్ష్యాలను సాధిస్తారు. ఆఫీస్‌లో పైఅధికారులతో జాగ్రత్త. బిజినెస్‌లో అనుభవజ్ఞుల మాట వినడం మేలు. సూర్యారాధన చేయండి.

ధనుస్సు
ఉద్యోగంలో సూపర్ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. ఇంట్లో ఆనందకరమైన శుభవార్తలు వింటారు. శివారాధన శ్రేయస్కరం.

మకరం
వ్యాపారంలో ప్లానింగ్ ముఖ్యం. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ముందడుగు వేసేటప్పుడు ఇతరుల సలహాలు తీసుకోండి. లక్ష్మీదేవిని ధ్యానించండి.

కుంభం
పనుల్లో శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. ఆలస్యం చేయకుండా పూర్తి చేయండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

మీనం
కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్తే సక్సెస్ మీదే! ఆఫీస్‌లో పురోగతి ఉంటుంది. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఈశ్వర ధ్యానం చేయండి.

Also Read : మార్కెట్‌లో కొత్త సరుకు: iPhone స్టైల్లో పోకో నుంచి కిర్రాక్ మొబైల్..!