Horoscope 2026 Today
Horoscope 2026 Today

మేషం
మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటే విజయం వరిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

వృషభం
వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మంచిది.

మిథునం
గ్రహబలం మిశ్రమంగా ఉన్నా, ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. శ్రీలక్ష్మీదేవి ధ్యానం మేలు చేస్తుంది.

కర్కాటకం
పట్టుదలతో ప్రయత్నిస్తే ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

సింహం
నేడు ప్రారంభించిన పనులు సాఫీగా సాగుతాయి. ఇతరులను అతిగా నమ్మవద్దు. శ్రీరామ నామస్మరణ మంచిది.

Also Read : చిన్నారులను టార్గెట్ చేస్తున్న సైలెంట్ కిల్లర్.. గుజరాత్‌ను గజగజలాడిస్తున్న చండీపురా వైరస్

కన్య
ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లాభాలు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభకరం.

తుల
దైవబలంతో పనుల్లో విజయం, ధనలాభం కలుగుతాయి. అనవసర తగాదాలకు దూరంగా ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణ ఉత్తమం.

వృశ్చికం
ఉద్యోగం, కుటుంబంలో శుభ ఫలితాలు ఉంటాయి. వేడుకల్లో పాల్గొంటారు. శ్రీసుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి.

ధనుస్సు
తోటివారి సహాయంతో ఆటంకాలు తొలగుతాయి. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. శ్రీరామ నామస్మరణ మంచిది.

మకరం
పనుల్లో శుభ ఫలితాలు లభిస్తాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. శనిదేవుని ధ్యానం శుభప్రదం.

కుంభం
స్వతంత్ర నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. సమయాన్ని వృథా చేయకుండా లక్ష్యంపై దృష్టి పెట్టండి. నవగ్రహ ఆరాధన శ్రేయస్కరం.

మీనం
సమయపాలనతో పనులు పూర్తి చేయాలి. అధికారులతో సంయమనం వహించాలి. ఈశ్వర దర్శనం మనఃశాంతిని ఇస్తుంది.

Also Read : Ravi Prakash Analysis:15 ఏళ్ల పిల్ల Vs 75 ఏళ్ల పీఎం