DMK Leader Udhayanidhi Stalin Arrest: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. డీఎంకే నేత, శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. సీఎం విజయ్, హీరోయిన్ త్రిషలను ఉద్దేశించి ఉదయనిధి ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసు ఆధారంగానే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారు.

Also Read : నీట్ నిరసనకారులపై కేసుల ఎత్తివేతకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్: విద్యార్థులకు బిగ్ రిలీఫ్!

కావేరీ నదీ జలాల అంశంపై నిర్వహించిన నిరసన ప్రదర్శన తమిళనాడు రాజకీయంలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ధర్నాలో మాట్లాడిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ రాష్ట్రంలోని విజయ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ‘డమ్మీ సీఎం’ పాలన వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.

అయితే ఆయన ప్రసంగిస్తుండగా కొందరు కార్యకర్తలు ‘త్రిష.. త్రిష’ అని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఉదయనిధి పరోక్షంగా నటి త్రిష పేరును ప్రస్తావిస్తూ డబుల్ మీనింగ్ వచ్చేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఆ తర్వాత తాను మాట్లాడింది కావేరీ నది గురించేనని ఆయన సమర్థించుకున్నప్పటికీ, విమర్శలు వచ్చాయి.

Also Read : IBPS క్లర్క్ 2026 నోటిఫికేషన్ విడుదల: 11,403 ఉద్యోగాల భర్తీ..ఏ రాష్ట్రంలో ఎన్నంటే?

ఉదయనిధి వ్యాఖ్యలపై టీవీకే, బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది మహిళలను అవమానించడమేనని, డీఎంకే దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. టీవీకే పార్టీ నాయకులు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసి, ఉదయనిధి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు తనను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారంతో ఉదయనిధి ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.