
PM Modi House: ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురు ఎంపీలు నిరసన చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.
Also Read : LPG సిలిండర్ల ధరకు చెక్.. ఇక ‘ఇథనాల్’ గ్యాస్‌తో వంట
𝐏𝐌 𝐚𝐧𝐝 𝐇𝐌 𝐦𝐮𝐬𝐭 𝐫𝐞𝐬𝐢𝐠𝐧 𝐟𝐨𝐫 𝐝𝐞𝐬𝐭𝐫𝐨𝐲𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐟𝐮𝐭𝐮𝐫𝐞 𝐨𝐟 𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐲𝐨𝐮𝐭𝐡. pic.twitter.com/PTvavyN2cm
— Congress (@INCIndia) July 21, 2026
విద్యార్థుల నిరసనకారులపై పోలీసుల చర్యలను ప్రశ్నిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండటాన్ని రాహుల్ గాంధీ మంగళవారం తప్పుపట్టారు. దీన్ని ఆయన భారతీయ సంస్కృతికి విరుద్ధమైనది అని అభివర్ణించారు. జాతీయ రాజధానిలో సోమవారం జరిగిన నిరసనల సమయంలో రోడ్లు బ్లాక్ కావడం, పోలీసు బారికేడ్లు విరిగిపోవడం, ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి బాష్పవాయువు ప్రయోగించడం వంటి ఘర్షణల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇతర ప్రతిపక్ష ఎంపీలతో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, “నిన్న జరిగిన ఘటనకు మోదీజీ కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. యువత విద్యా, పరీక్షల విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. విద్యా, పరీక్షల వ్యవస్థను చెదపురుగులు తినేశాయని దేశం మొత్తానికి తెలుసు” అని అన్నారు.
విద్యార్థులపై పోలీసుల చర్యలు, పరీక్షల అవకతవకలపై చర్చించాలని కోరుతూ రాహుల్ గాంధీతో పాటు సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, శివసేన ఎంపీ అరవింద్ సావంత్, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్.కె. ప్రేమచంద్రన్, ఇతర ప్రతిపక్ష నాయకులు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి విజ్ఞప్తి చేశారు.
Also Read : హిమాలయాల్లో పర్యావరణ విలయం: ప్రకృతి విపత్తుల వెనుక మితిమీరిన మానవ ప్రమేయం!









