
BIG BREAKING : ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ నిరసన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటుగా కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, దీపేందర్ హుడాలతో పాటుగా పలువురు NSUI, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక వాహనంలో వారిని అక్కడినుంచి తరలించారు. దీంతో సుమారు 9 గంటల పాటు కాంగ్రెస్ నిరసనను పోలీసులు భగ్నం చేశారు. కాగా జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ నిరసన కొనసాగిస్తామని విపక్ష నేతలు చెబుతున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, టీఎంసీ నేతలు అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఓబ్రెయిన్ సహా పలువురు విపక్ష నాయకులు పాల్గొన్నారు. SIR వివాదానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.









