
ప్రస్తుతం చాలా మంది నెల నెలా రీఛార్జ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాటికి చెక్ పెట్టేందుకు ప్రముఖ టెలికాం కంపెనీలు ఒక సంవత్సరం వ్యాలిడిటీతో అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలు వీటిని తమ యూజర్లకు అందిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఇవి ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తాయి. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో OTT సబ్స్క్రిప్షన్లు, AI ప్లాన్లు, ఫ్రీ రోమింగ్ సహా అనేక ప్రయోజనాలను కూడా అందిస్తాయి.
Jio Recharge Plan
Jio తమ యూజర్ల కోసం రూ.3599లకు అదిరిపోయే ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. దీంతోపాటు ప్రతిరోజు 2.5GB డేటా డేటా లభిస్తుంది. అంటే మొత్తం 912.5GB డేటా పొందొచ్చు. 5జీ నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లో అన్లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, డైలీ 100 SMSలను అందిస్తుంది.
ఇవి మాత్రమే కాకుండా.. ఈ ప్లాన్‌లో జియోహాట్‌స్టార్ మొబైల్ + హాలీవుడ్ సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తుంది. ఇందులో జియోటీవీ ప్రో ప్యాక్ లభిస్తుంది. ఇది 1,000కి పైగా టీవీ ఛానెళ్లకు యాక్సెస్‌ను అందిస్తుంది. డేటా బూస్టర్ 120GB అదనపు డేటా, జియోఏఐక్లౌడ్ 50GB ఫ్రీ స్టోరేజ్ అందిస్తుంది. ఇతర ప్రయోజనాలలో రూ.35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమిని ప్రో ప్లాన్ ఫ్రీగా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో పాటు EaseMyTrip, AJIO, Cinépolis నుండి కూపన్లు పొందొచ్చు. అంతేకాకుండా రూ.1590 విలువైన కాన్వా ప్రో లైట్ కూడా ఫ్రీగా లభిస్తుంది.
Airtel Recharge Plan
ఎయిర్టెల్ రూ.3,599 ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ, ప్రతిరోజూ 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలు అందిస్తుంది. 5జీ నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లో అన్లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఇతర ప్రయోజనాలలో 12 నెలల పాటు రూ.4000 విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ఉచిత సబ్స్క్రిప్షన్, ఎయిర్టెల్ సేఫ్ నెట్వర్క్ నుండి ఉచిత కంటెంట్, ఉచిత హెలోట్యూన్స్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లేలను అందిస్తుంది.
VI Recharge Plan
వోడాఫోన్ ఐడియా రూ.3599 ప్లాన్‌లో కూడా అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా, అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 100 SMSలను అందిస్తుంది. అలాగే ఈ ప్లాన్‌లో రోమింగ్ ప్రయోజనాలుగా.. 5 రోజులకు 1GB డేటా, 50 నిమిషాల అవుట్గోయింగ్, ఇన్కమింగ్ కాల్స్, అపరిమిత SMSలు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా అర్ధరాత్రి 12 నుండి అపరిమిత డేటా లభిస్తుంది. వీకెండ్ డేటా రోల్ఓవర్లో.. సోమవారం నుండి శుక్రవారం వరకు మిగిలిపోయిన డేటాను శని, ఆదివారాల్లో ఉపయోగించుకోవచ్చు. ప్రతి నెలా 2GB వరకు డేటా బ్యాకప్ సౌకర్యం అందుబాటులో ఉంది.









