
ఒక్కసారి ఊహించుకోండి.. రేపు ఉదయం నిద్రలేచి Instagram ఓపెన్ చేస్తే.. ‘‘ఈ సర్వీస్ భారతదేశంలో ఇకపై అందుబాటులో లేదు.’’ (This service is no longer available in India) అని కనిపిస్తే?.. మీ ఫొటోస్, రీల్స్, ఫాలోవర్స్, బిజినెస్ పేజెస్, క్రియేటర్స్ ఆదాయం.. అన్నీ ఒక్కరోజులో ఆగిపోతే? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ అవుతోంది. ‘‘ఆగస్టు 25 నుంచి భారత్‌లో Instagram Ban.’’ లక్షల మంది నిజమే అనుకున్నారు. కొంతమంది తమ ఫొటోస్, వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా మొదలుపెట్టారు. కానీ.. ఈ వార్త వెనుక అసలు నిజం ఏంటి? ఇండియన్ గవర్నమెంట్ నిజంగానే ఇన్‌స్టాగ్రామ్‌ను బ్యాన్ చేయబోతుందా? లేక.. ఇది మరో సోషల్ మీడియా రూమర్ మాత్రమేనా? అనేది పూర్తిగా తెలుసుకుందాం.
ప్రస్తుతం ప్రపంచం సోషల్ మీడియా చుట్టూనే తిరుగుతోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలా మంది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ ఎక్స్ లాంటి ప్లాట్ ఫార్మ్స్ మీదే ఎక్కువ టైం గడుపుతున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు కేవలం ఎంటర్టైన్మెంట్ యాప్ కాదు. చాలామందికి అది బిజినెస్, కెరీర్, ఇన్కమ్ సోర్స్, పర్సనల్ బ్రాండ్.. ఇలా అన్నీ అయిపోయింది. అందుకే “Instagram Ban” అనే ఒక్క మాట వినగానే కోట్ల మంది ఒక్కసారిగా టెన్షన్ పడిపోయారు.
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ స్పీడ్‌గా వైరల్ అయ్యింది. “2026 ఆగస్టు 25 రాత్రి నుంచి భారత ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామ్‌ను బ్యాన్ చేయబోతోంది.” ఈ మెసేజ్ వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ పోస్ట్స్, ఇన్‌స్టా స్టోరీస్, టెలిగ్రామ్ ఛానెల్స్‌లో అన్ని చోట్ల చక్కర్లు కొట్టింది. ఎవరూ అఫీషియల్ సోర్స్ చూడలేదు. కానీ అందరూ ఫార్వర్డ్ మాత్రం చేశారు. కొంతమంది అయితే.. “ముందే ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోండి” “డేటా బ్యాకప్ తీసుకోండి..” అంటూ కొత్త పోస్టులు కూడా పెట్టడం మొదలుపెట్టారు. రూమర్ ఎంత వేగంగా పాకిందో.. చాలామంది అది నిజమే అనుకున్నారు.
ఇక్కడే PIB (Press Information Bureau Fact Check) ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగింది. భారత ప్రభుత్వ అధికారికంగా నిజం ఏదో అబద్దం ఏదో చెప్పే వ్యవస్థ. PIB తన అఫీషియల్ ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ ద్వారా స్పష్టంగా ప్రకటించింది. “ఆగస్టు 25 నుంచి Instagramను Ban చేస్తున్నారనే వార్త పూర్తిగా ఫేక్.” భారత ప్రభుత్వం అలాంటి ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాంటి నిర్ణయం కూడా ప్రకటించలేదు. అంటే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్.. అధికారికంగా పూర్తిగా తప్పుడు సమాచారం.
Also Read : E20 కాంట్రవర్సీపై నితిన్ గడ్కరీ షాకింగ్ రియాక్షన్.. మాట మార్చిన కేంద్ర మంత్రి..!
PIB మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పింది. “దయచేసి ఇలాంటి మెసేజ్‌ని వెరిఫై చేయకుండా ఫార్వర్డ్ చేయొద్దు.” ఎందుకంటే… ఇలాంటి ఫేక్ న్యూస్ ఒక్కసారి వైరల్ అయితే… లక్షల మందిని తప్పుదోవ పట్టిస్తుంది. ఒక ఫేక్ పోస్ట్ కొన్ని గంటల్లో కోట్ల మందికి చేరిపోతుంది. కానీ… దాన్ని ఖండించే అఫీషియల్ స్టేట్మెంట్.. చాలామందికి చేరదు. అందుకే ఫేక్ న్యూస్ అంత డేంజరస్.
ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఇన్స్టాగ్రామ్ లాంటి పెద్ద ప్లాట్‌ఫార్మ్‌ని బ్యాన్ చేయాలంటే.. అది ఒక చిన్న నిర్ణయం కాదు. దానికి అఫీషియల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా గవర్నమెంట్ ప్రెస్ రిలీజ్ ఉంటుంది. మెటా కూడా అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తుంది. అలాంటి పెద్ద నిర్ణయం.. కేవలం వాట్సాప్ ఫార్వర్డ్ ద్వారా బయటకు రాదు. ఇప్పటి వరకు.. గవర్నమెంట్, మెటా లేదా ఐటీ మినిస్ట్రీ.. ఎవరూ ఇన్స్టాగ్రామ్ బ్యాన్ గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. అంటే.. ప్రస్తుతం భారత్‌లో ఇన్స్టాగ్రామ్ యథావిధిగా పనిచేస్తోంది. ఆగస్టు 25 నుంచి బ్యాన్ అమల్లోకి వస్తుందనే వార్తకు.. ఎలాంటి అఫీషియల్ ఆధారాలు లేవు.
ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అయితే.. ఇలాంటి రూమర్స్ ఎందుకు వస్తుంటాయి? సమాధానం చాలా సింపుల్. సోషల్ మీడియా ఆల్గారిథమ్. భయపెట్టే హెడ్‌లైన్స్.. షాకింగ్ న్యూస్.. బ్రేకింగ్ అలర్ట్స్.. వీటికే ఎక్కువ రీచ్ వస్తుంది. అందుకే కొందరు వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం, ఎంగేజ్మెంట్ కోసం, ఇలాంటి ఫేక్ పోస్ట్స్ క్రియేట్ చేస్తారు. మనం వెరిఫై చేయకుండా షేర్ చేస్తే.. వాళ్ల పని పూర్తయినట్టే.
ఇది మొదటిసారి కూడా కాదు. గతంలో కూడా… వాట్సాప్ బ్యాన్, యూట్యూబ్ బ్యాన్, పాన్ కార్డ్ క్యాన్సిల్, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ లాంటివి కూడా ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి. తర్వాత అఫీషియల్ ఫ్యాక్ట్ చెక్ వచ్చిన తర్వాత అవన్నీ ఫేక్ అని తేలిపోయాయి. కానీ అప్పటికే కోట్ల మంది వాటిని నిజమని నమ్మేశారు.
Also Read : పేపర్ లీక్ చేస్తే పదేళ్ల జైలు, 10 కోట్ల జరిమానా.. కేంద్రం సంచలన చట్ట సవరణ!
ఇదే సమయంలో మెటాకు సంబంధించిన మరో విషయం కూడా వార్తల్లోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఫీషియల్ ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న ఒక వీడియో కొంతసేపు కనిపించకుండా పోయింది. ఆ వీడియో దేని గురించో కాదు.. పేపర్ లీక్స్‌పై Gen Z చేస్తున్న ఉద్యమం గురించి మోదీ మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో మెటా కావాలనే తొలగించిందని చాలామంది అనుకున్నారు. సోషల్ మీడియాలో అలాగే జనాల్లోకి వెళ్లింది. ఓ దేశ ప్రధాని పోస్ట్‌నే డిలీట్ చేస్తారా అని అది మెటాపైకి రివర్స్ అయ్యింది. మొదట ఫేస్బుక్లో కనిపించిన మెసేజ్ వల్ల.. చాలామంది అది లీగల్ ఆర్డర్ వల్ల తొలగించారని అనుకున్నారు. సోషల్ మీడియా మళ్లీ పెద్ద చర్చ మొదలైంది. కానీ.. కొంతసేపటికే మెటా అఫీషియల్ వివరణ ఇచ్చింది. “ఇది లీగల్ ఇష్యూ కాదు. ప్లాట్ ఫార్మ్స్ లో వచ్చిన టెంపరరీ టెక్నికల్ గ్లిట్చ్.” అని తెలిపింది. ప్లాబ్లమ్ గుర్తించిన వెంటనే… వీడియోను రీస్టోర్ చేశామని.. అసౌకర్యానికి క్షమాపణలు కూడా చెప్పింది. అంటే.. కొన్నిసార్లు టెక్నాలజీలో వచ్చే చిన్న టెక్నికల్ ఎర్రర్స్ కూడా.. సోషల్ మీడియాలో పెద్ద కాంట్రవర్సీగా మారిపోతాయి.
ఈ రెండు సంఘటనలు మనకు ఒకే లెసన్ చెబుతున్నాయి. సోషల్ మీడియాలో కనిపించిన ప్రతి పోస్ట్ నిజం కాదు. ట్రెండింగ్ టాపిక్ అంటే.. అది నిజమని అర్థం కాదు. వేల మంది షేర్ చేశారంటే… అది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అవదు. ప్రభుత్వానికి సంబంధించిన న్యూస్ అయితే.. ఎప్పుడూ అఫీషియల్ సోర్స్నే చెక్ చేయాలి. PIB ఫ్యాక్ట్ చెక్.. గవర్నమెంట్ వెబ్‌సైట్స్.. ఆయా శాఖ మినిస్ట్రీ ప్రకటనలు.. ఇవే ఫైనల్ రిఫరెన్స్. ఫార్వర్డ్ వచ్చిన మెసేజ్ కాదు. అన్నోన్ యూట్యూబ్ ఛానెల్స్ కాదు. ర్యాండమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కాదు.
ప్రస్తుత ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ కంటే.. మిస్ఇన్ఫర్మేషన్ ఇంకా వేగంగా పరిగెడుతోంది. ఒక క్లిక్… ఒక షేర్… ఒక ఫార్వర్డ్… లక్షల మందిని తప్పుదోవ పట్టించగలవు. అందుకే… ఏ న్యూస్ అయినా… నమ్మే ముందు వెరిఫై చేయండి. షేర్ చేసే ముందు రెండుసార్లు ఆలోచించండి. ఎందుకంటే… ఫేక్ న్యూస్‌కి పెద్ద బలం.. మన గుడ్డి నమ్మకమే. ఇన్స్టాగ్రామ్ బ్యాన్ రూమర్ గురించి మీరేమనుకున్నారు? మొదట నిజమే అనుకున్నారా? లేక ఫేక్ అని ముందే గుర్తించారా? మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి.









