
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ తరచూ కొత్త కొత్త సేల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. పలు ప్రొడెక్టులపై భారీ ఆఫర్లు అందిస్తూ.. కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. కాగా ఇప్పటి వరకు ఆన్‌లైన్ షాపింగ్‌తో దూసుకుపోతున్న ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో డీల్ కుదుర్చుకుంది. దీని ద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందొచ్చు.
భారతదేశ ఈ కామర్స్ చరిత్రలో ఒక ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్ ఫార్మ్.. నెట్‌ఫ్లిక్స్ సేవలను అందించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా ఈ బంపరాఫర్ ఆగస్టు 1, 2026 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఆఫర్ ఎలా పనిచేస్తుంది?.. దీనిని పొందాలంటే ఏం చేయాలి? అనేది పూర్తిగా తెలుసుకుందాం.
ఈ ఆఫర్ పొందాలంటే వినియోగదారులు ప్రత్యేకంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ వేసుకోవలసిన అవసరం లేదు. అలాగే మొబైల్ రీఛార్జ్‌లో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌ను ఎంచుకోవలసిన పనిలేదు. కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో రెగ్యులర్‌గా షాపింగ్ చేస్తే చాలు. ఈ బంపరాఫర్ పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌తో నెట్‌ఫ్లిక్స్ ఎలా పొందాలి?
Flipkart Plus సభ్యులు ఒక నెలలోపు రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ విలువైన నాలుగు ఆర్డర్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ ఆర్డర్‌లను ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ అనే మూడు ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కడైన చేయవచ్చు.
నాలుగవ ఆర్డర్ పూర్తయిన వెంటనే నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ నెక్స్ట్ 30 రోజుల పాటు ఉచితంగా ప్రారంభమవుతుంది.
నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనాలు ఫ్లిప్‌కార్ట్ యాప్ నుండే నేరుగా యాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికోసం వినియోగదారులు విడిగా లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఎక్స్‌ట్రా ఖర్చు చేయాల్సిన పని లేదు. ఇచ్చిన 30 రోజుల గడువు ప్లాన్ ముగిసిన తర్వాత ఎలాంటి ఆటోపే లేకుండా ఆగిపోతుంది.
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యత్వం ఎలా పొందాలి?
మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యత్వం పొందాలంటే కొన్ని సూచనలు పాటించాలి. దీనికోసం మీరు 12 నెలల వ్యవధిలో 15 ఆర్డర్‌లను పూర్తి చేయాలి. 15 ఆర్డర్‌లను పూర్తి చేసిన తర్వాత.. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా మీ ప్లస్ సభ్యత్వం ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.
ఇలా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయడం ద్వారా వినియోగదారులు ఎలాంటి ఎక్స్‌ట్రా ఖర్చు లేకుండా నెట్‌ఫ్లి్క్స్ వినోదాన్ని పొందొచ్చు. ఈ ఆఫర్ ప్లస్ సభ్యులకు ఎంతో ప్రయోజనకంగా ఉండనున్నాయి.









