Amazon Great Freedom Sale
Amazon Great Freedom Sale

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఇండియా.. మరో కొత్త సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా Amazon Great Freedom Saleను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, మొబైల్ యాక్సెసరీలు, ల్యాప్‌టాప్‌లు, TWS ప్రొడెక్ట్‌లు అత్యంత తక్కువ ధరలకే సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా గృహోపకరణాలు 80% వరకు తగ్గింపులతో కొనుక్కోవచ్చు.

Amazon Great Freedom Sale ఆగస్టు 7న ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లను భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్, రియల్‌మీ, రెడ్‌మీ, వివో సహా మరిన్ని కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్లతో సొంతం చేసుకోవచ్చు. అలాగే మొబైల్ యాక్సెసరీలు, TWS, నెక్ బ్యాండ్లు, పవర్ బ్యాంకులు, మొబైల్ ఛార్జర్లు కూడా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

ఈ Amazon Great Freedom Sale సమయంలో గృహోపకరణాల కేటగిరీలోని వస్తువులు కూడా భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎయిర్ కండిషనర్లు (ACలు), రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ టీవీలు కూడా తగ్గింపు ధరలకు కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా HDFC బ్యాంక్ కార్డులపై 10% తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ సేల్‌కు సంబంధించిన ప్రొడెక్టుల ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు త్వరలో వెల్లడి కానున్నాయి.