
అమెరికాలో నవంబర్ 3న జరగనున్న మిడ్‌టెర్మ్ ఎన్నికలు అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి, బరాక్ ఒబామా ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ పార్టీ గట్టి పోటీనిస్తోంది. ఈ ఎలక్షన్స్‌లో యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌తో పాటు సెనేట్‌ను కూడా కైవసం చేసుకునే అనుకూల పరిస్థితులు డెమోక్రాట్లకు ఉన్నాయి. అదే జరిగితే, గత రెండేళ్ల పూర్తి రిపబ్లికన్ పాలనకు చెక్ పడి, వాషింగ్టన్‌లో డెమోక్రాట్లు కూడా పవర్ షేర్ చేసుకుంటారు.
యూఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం యుద్ధ ప్రకటనలు, ప్రభుత్వ ఖర్చులను నియంత్రించే హక్కు చట్టసభ సభ్యులకే ఉండాలని డెమోక్రాట్లు వాదిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలి కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల బలం పెరిగితే ప్రపంచ రాజకీయాల్లో నాలుగు కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది:
Also Read : ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహు భవిషత్ తేల్చే 3 పాయింట్లు ఇవే!
1. ఇరాన్‌తో యుద్ధానికి బ్రేక్
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యుద్ధం ప్రకటించే సమయంలో ట్రంప్ కాంగ్రెస్ అప్రూవల్ తీసుకోలేదు. చట్టసభ ఆమోదం లేకుండా జరుగుతున్న ఈ కాన్ఫ్లిక్ట్‌ను వెంటనే ముగించాలని డెమోక్రాట్లు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో కొంతమంది రిపబ్లికన్ల సపోర్ట్‌తో ఆమోదించిన తీర్మానాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోలేదు. ఇప్పుడు డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తే ఈ వార్‌ను ఆపేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
2. ఉక్రెయిన్‌కు అమెరికా అండ
రష్యా దూకుడును ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న ఆర్థిక, సైనిక సహాయాన్ని ట్రంప్ పెద్ద ఎత్తున నిలిపివేశారు. దీనికితోడు, రష్యా డీజిల్, ఇంధనంపై శాంక్షన్స్‌ను చట్టంగా మార్చిన కొద్దివారాలకే వాటిని ఎత్తివేసి సొంత పార్టీ నేతలతో సహా అందరి ఆగ్రహానికి గురయ్యారు. కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు పట్టు సాధిస్తే ఉక్రెయిన్‌కు మిలిటరీ, ఫైనాన్షియల్ సపోర్ట్ మళ్లీ పుంజుకుంటుంది.
3. ఇజ్రాయెల్ మిలిటరీ ఎయిడ్‌పై ఆంక్షలు
గాజా యుద్ధంలో వేలాది మంది పాలస్తీనియన్ల మరణాలు, వెస్ట్ బ్యాంక్‌లో కొనసాగుతున్న హింస డెమోక్రాట్లలో ఇజ్రాయెల్‌పై వ్యతిరేకతను పెంచాయి. పైగా ప్రధాని నెతన్యాహుకు రిపబ్లికన్లతో ఉన్న సాన్నిహిత్యం కూడా ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరంలో ఇజ్రాయెల్‌కు రికార్డు స్థాయిలో $3.8 బిలియన్ల సైనిక సాయం అందింది. డెమోక్రాట్లు అధికారంలోకి వస్తే భారీ బాంబుల సరఫరాతో పాటు మిలిటరీ ఎయిడ్‌ను గణనీయంగా తగ్గించడం లేదా పూర్తిగా ఆపేసే చాన్సెస్ ఉన్నాయి.
Also Read : కూరగాయల మార్కెట్‌ను తలపిస్తున్న చైనా గోల్డ్ మార్కెట్.. పసిడి కొనుగోళ్లలో రికార్డుల మోత.. కారణమిదే!
4. రక్షణ బడ్జెట్‌కు కళ్లెం – ఫారిన్ ఎయిడ్ పునరుద్ధరణ
మిలిటరీ బడ్జెట్‌ను ఏకంగా 67% పెంచి $1.5 ట్రిలియన్లకు తీసుకెళ్లాలన్న ట్రంప్ ప్రతిపాదనను డెమోక్రాట్లు ఇప్పటికే సెనేట్‌లో అడ్డుకున్నారు. సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్‌కు నిధులు తగ్గించి, యుద్ధాలకు ఖర్చు చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే ట్రంప్ రద్దు చేసిన బిలియన్ల డాలర్ల విదేశీ సహాయాన్ని తిరిగి పునరుద్ధరించడానికి డెమోక్రాట్లు ప్లాన్ చేస్తున్నారు.
మొత్తంగా, ఈ మిడ్‌టెర్మ్ ఫలితాలు అమెరికా అంతర్గత రాజకీయాలకే కాక, గ్లోబల్ పాలసీలు, యుద్ధాల భవిష్యత్తును నిర్ణయించడంలో అత్యంత కీలకంగా మారనున్నాయి.









