
ఒకవైపు ఇరాన్‌పై అమెరికా భారీ దాడులకు ప్లాన్స్ సిద్ధం చేసుకుంటుండగా, మరోవైపు యుద్ధ మేఘాలను తొలగించేందుకు దౌత్య ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తగ్గించేందుకు కీలక ప్రిలిమినరీ అగ్రిమెంట్ డ్రాఫ్ట్ (ముసాయిదా ఒప్పందం) సిద్ధమైనట్లు ‘అల్ అరేబియా ఇంగ్లిష్’ కథనం వెల్లడించింది. ఈ డీల్ అమలుకు చైనా గ్యారెంటార్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉంది.
యురేనియం నిల్వలపై 2 ఆప్షన్స్: ఇరాన్ తన వద్ద ఉన్న హై-ఎన్రిచ్డ్ యురేనియం నిల్వలను పరస్పర అంగీకారంతో మూడో దేశానికి తరలించడం, లేదా వాటి ప్యూరిఫికేషన్ (శుద్ధి) స్థాయిని భారీగా తగ్గించడం. ఈ రెండింటిలో ఏదో ఒకదానికి అంగీకరిస్తే అణు వివాదం కొలిక్కి వచ్చినట్లే.
హర్మూజ్ జలసంధి రీఓపెన్: అగ్రిమెంట్‌పై ప్రాథమిక అవగాహన కుదిరిన 7 రోజుల్లోనే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌ను ఇంటర్నేషనల్ షిప్పింగ్ కోసం తిరిగి తెరవాలని ప్రతిపాదించారు.
ఆంక్షల సడలింపు & వెరిఫికేషన్: ఇరాన్ చర్యలకు ప్రతిగా అమెరికా కూడా ఆంక్షలు, ఆర్థిక పరిమితులను సడలించాల్సి ఉంటుంది. ఎవరూ మోసం చేయకుండా చూసేందుకు ఇండిపెండెంట్ వెరిఫికేషన్ సిస్టమ్‌తో పాటు, నిబంధనలు ఉల్లంఘిస్తే సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక డిస్ప్యూట్ రెసల్యూషన్ మెకానిజంను ఏర్పాటు చేయనున్నారు.
దోహా వేదికగా డైరెక్ట్ టాక్స్.. రంగంలోకి ఖతార్!
ఈ డైరెక్ట్ టాక్స్ కోసం ఇస్తాంబుల్‌కు బదులు ఖతార్ రాజధాని దోహాను వేదికగా ముసాయిదాలో ప్రతిపాదించారు. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం కోసం ఖతార్ చురుగ్గా పావులు కదుపుతోంది. ఖతార్ ప్రధాని, విదేశాంగ మంత్రి సీనియర్ సలహాదారు నేతృత్వంలోని హై-లెవల్ డెలిగేషన్ శుక్రవారం టెహ్రాన్ చేరుకుని ఇరాన్ అధికారులతో చర్చలు జరిపింది.
మరోవైపు, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్.. ఇరాన్ సెక్యూరిటీ అఫీషియల్ మొహసేన్ రెజాయికి పంపిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఖతార్ ప్రతినిధుల ద్వారా చేరిన ఈ లెటర్లో కొత్త దౌత్య చర్చల ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద, ఈ ప్రిలిమినరీ డీల్ పట్టాలెక్కితే మిడిల్ ఈస్ట్‌లో మరో యుద్ధ ముప్పు తప్పుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.









