Prabhas : ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాకు కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అక్టోబర్ 18న ఆదివారం సందీప్ రెడ్డి వంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో పాటు ప్రభాస్‌కు సంబంధించిన కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

‘స్పిరిట్’ సినిమా 2027 మార్చి 5న థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. అయితే తాజాగా ఆ రిలీజ్ డేట్‌ను మార్చేశారు. ఇక ఈ సినిమా 2027 అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీపావళి సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Also Read : ఆరేళ్ల లవ్, పెళ్లై నెల రోజులకే.. గుండెపోటుతో యంగ్ డైరెక్టర్ మృతి!

అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అదే సమయంలో ‘రామాయణం పార్ట్ 2’ కూడా బాక్సాఫీస్ బరిలోకి రానుంది. దీంతో ప్రభాస్ ‘స్పిరిట్’కు, ‘రామాయణం పార్ట్ 2’కు నేరుగా బాక్సాఫీస్ క్లాష్ తప్పేలా లేదు. కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. 2027 అక్టోబర్ 29, దీపావళి.. వరల్డ్‌వైడ్ రిలీజ్ అంటూ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటికే ప్రభాస్ సినిమాలకు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉండటంతో ‘స్పిరిట్’పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం కావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు దీపావళి సీజన్‌లో ‘రామాయణం పార్ట్ 2’తో పోటీ పడనుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య పోరు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : రణబాలి రివ్యూ.. విజయ్– రష్మిక కాంబో హిట్టా – ఫట్టా?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.