మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్ర ఇరుముడి. డైరెక్టర్ శివ నిర్వాహణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ సంపాదించుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా స్టోరీ బాగుందని, రవితేజ తన సహజ నటనతో మెప్పించాడని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఇరుముడి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

Also Read : టాలీవుడ్‌లో తీవ్ర విషాదం… సీనియర్‌ నటుడు మృతి

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేశారు. “నా సోదరుడు రవితేజకు ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు అని తెలిపారు. మొదటి నుంచి చివరి వరకు ఈ సినిమాను నేను ఎంతో ఆస్వాదించాను. రవితేజ అద్భుతమైన నటనతో మైమరిపించారు. ‘త్రినాథ్’ పాత్రను తన భుజస్కంధాలపై వేసుకొని ఒంటిచేత్తో సినిమాను నడిపించారని పొగిడారు. అలాగే సినిమాను తెరకెక్కించిన విధానంపై దర్శకుడు శివ నిర్వాణను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. కథలో ఎమోషన్‌ను, లోతును ఎంతో అద్భుతంగా స్క్రీన్ ప్లేలో చూపించారని అన్నారు.

సినిమాను చాలా చక్కగా ప్రెసెంట్ చేశారని దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు. అలాగే సినిమాలో కీలక పాత్ర పోషించిన బేబీ నక్షత్రకు మంచి భవిష్యత్తు ఉందని ఆశీస్సులు అందించారు. ఈ చిత్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్‌తో పాటు సినిమా విజయంలో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ చిరంజీవి తన శుభాకాంక్షలు తెలిపారు. కేవలం సినిమాను అభినందించడమే కాకుండా, సినీ పరిశ్రమ గురించి చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేశారు. “ఒక సినిమా విజయం సాధిస్తే అది పరిశ్రమలోని అందరికీ పండుగే. ఈ పరిశ్రమ అందరిదీ… ఏ కొందరిదో కాదు. మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి!” అంటూ ఆయన అన్నారు.

Also Read : వివాదంలో ఇరుముడి చిత్రం.. ఆ సీన్లను తొలిగించాలంటూ డిమాండ్!