condoms : ఫ్రాన్స్‌లో దాదాపు 2 లక్షల 60 వేల కండోమ్‌లు సురక్షితం కాదంటూ షాకింగ్ నిజం బయటపడింది. ఇవి వాడితే ప్రమాదమని తేలడంతో మార్కెట్‌లో ఉన్న ఆ కండోమ్‌లన్నింటినీ అధికారులు వెనక్కి రప్పించారు. దుకాణాలు, మెడికల్ షాపులు, ఆన్‌లైన్‌లో అమ్ముతున్న ఈ కండోమ్‌లు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని ఫ్రాన్స్ దేశానికి చెందిన విచారణ సంస్థలు ప్రజలను అప్రమత్తం చేశాయి. ల్యాబ్ పరీక్షల్లో కొన్ని కండోమ్‌లు సులభంగా చిరిగిపోతున్నాయని, వాటికి చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా, ఆన్‌లైన్‌లో అమ్ముతున్న దాదాపు 30 రకాల కండోమ్‌లు ఎలాంటి భద్రతా నిబంధనలు పాటించలేదని తేలింది. వీటిలో ఇప్పటికే సుమారు 40 వేల కండోమ్‌లు కస్టమర్ల చేతికి కూడా వెళ్లిపోయాయి.

ఫ్రాన్స్‌కు చెందిన మోసాలను అరికట్టే ఏజెన్సీ, ఆరోగ్య శాఖ కలిసి ఈ వివరాలను బయటపెట్టాయి. దుకాణాలు, మెడికల్ షాపుల నుంచి సుమారు 2 లక్షల 60 వేల కండోమ్‌లను వెనక్కి తెప్పించినట్లు చెప్పాయి. ల్యాబ్ టెస్టుల్లో వీటిలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు తేలిందని, ఇవి వాడితే చిరిగిపోయే లేదా రంధ్రాల ద్వారా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కండోమ్‌లను ఇప్పటికే ఎవరైనా వాడితే, వారు వెంటనే ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రాలేదని చెక్ చేయించుకోవాలని, ఒకవేళ పీరియడ్స్ మిస్ అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేసుకోవాలని సలహా ఇచ్చారు.

ఆన్‌లైన్‌లో అమ్ముతున్న ఈ కండోమ్‌లపై ఎలాంటి సేఫ్టీ సర్టిఫికేట్లు లేవని, వాటి మీద ఫ్రెంచ్ భాషలో ముద్రించాల్సిన సమాచారం కూడా లేదని విచారణలో తేలింది. వీటిలో వెయ్యి బాక్సులు, అంటే 40 వేలకు పైగా కండోమ్‌లు ఇప్పటికే జనాలు కొనేశారు. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి హాని జరిగిందని ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదని అధికారులు స్పష్టం చేశారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.