
Flights : అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో ఓ భారీ విమాన ప్రమాదం తప్పింది. ఒకే నంబర్‌తో ప్రయాణిస్తున్న రెండు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాలు గాల్లో ఒకదానికొకటి చాలా దగ్గరగా వచ్చి ఢీకొనే పరిస్థితి వచ్చింది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి పెద్ద ప్రమాదాన్ని అడ్డుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరిజోనాలోని ఫీనిక్స్ స్కై హార్బర్ విమానాశ్రయం దగ్గర ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో రెండు విమానాలకు అనుకోకుండా అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 2482 అనే ఒకే ఫ్లైట్ నంబర్ ఇచ్చారు.
ఇంతకు ఏం జరిగిందంటే.. చికాగో నుంచి ఒక విమానం ఫీనిక్స్ ఎయిర్‌పోర్ట్‌లో దిగడానికి వస్తుండగా, అదే సమయంలో ఇంకో విమానం ఫీనిక్స్ నుంచి వేరే ఊరు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. రెండింటికీ ఒకే ఫ్లైట్ నంబర్ ఉండటంతో పైలట్లకు తీవ్ర అయోమయం నెలకొంది. వీరిద్దరి విమాన మార్గాలు ఒకే చోట కలిసే ప్రమాదం ఏర్పడింది. పరిస్థితిని గమనించిన కంట్రోలర్ వెంటనే స్పందించి, వారిని పిలిచేటప్పుడు ఒకరిని కిందకు దిగుతున్న 2482 విమానం అని, మరొకరిని “పైకి వెళ్తున్న 2482 విమానం అని వేర్వేరు పేర్లతో పిలుస్తూ జాగ్రత్తలు చెప్పారు.
Also Read : వైట్‌హౌస్‌కు కూతవేటు దూరంలో చైనా స్నైపర్: అమెరికాలో కలకలం!
దిగుతున్న విమానాన్ని పైన ఉంచి, కింద నుంచి పైకి వెళ్తున్న విమానాన్ని ఎక్కువ ఎత్తుకు వెళ్లకుండా కంట్రోలర్ ఆపారు. చాలా దూరంలో ఉన్నప్పుడే ఇద్దరు పైలట్లు ఒకరి విమానాన్ని మరొకరు చూసుకునేలా చేసి, రెండింటి మధ్య సురక్షితమైన దూరం ఉండేలా చూశారు. 25 ఏళ్ల తన ఉద్యోగంలో ఒకే నంబర్‌తో రెండు విమానాలు ఇలా గాల్లో కలవడం ఎప్పుడూ చూడలేదని, ఇది నిజంగా నమ్మలేకుండా ఉందని ఆ కంట్రోలర్ చెప్పారు. విమానాలు సురక్షితంగా వెళ్లిన తర్వాత ల్యాండ్ అయిన విమానం పైలట్ కంట్రోలర్ చేసిన పనిని బాగా మెచ్చుకున్నారు.
అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఆఫీసులో జరిగిన చిన్న పొరపాటు వల్లే ఈ రెండు విమానాలకు ఒకే నంబర్ వచ్చిందని విమాన రంగ నిపుణులు చెబుతున్నారు. చికాగో నుంచి రావాల్సిన ఫ్లైట్ వాతావరణం బాగా లేక ఆలస్యం కావడంతో, సమయానికి ప్రయాణికులను తీసుకెళ్లడానికి ఫీనిక్స్ నుంచి వేరే విమానాన్ని ఏర్పాటు చేశారు. కానీ రెండూ ఒకే సమయంలో గాల్లో ఉంటాయని ఎవరూ గమనించలేదు. ప్రస్తుతం అమెరికన్ ఎయిర్‌లైన్స్, అమెరికా విమానయాన సంస్థలు దీనిపై విచారణ చేస్తున్నాయి. కంట్రోలర్ , పైలట్ల చాకచక్యం వల్ల ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Also Read : భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో









