Census 2027 : భారతదేశానికి స్వాతంత్య్ర వచ్చి 80 ఏండ్లవుతుంది. ఇప్పటికీ అనేకసార్లు జనాభా లెక్కలు సేకరించారు. 2027లో మరోసారి జనాభాను లెక్కించబోతున్నారు. అయితే ఈసారి జనగణనకు ఒక ప్రత్యేకత ఉంది.స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా 2027 జనాభా లెక్కల్లో కులగణన చేయనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండో దశ జనగణన కోసం 40 ప్రశ్నలతో కూడిన జాబితాను ఇప్పటికే అధికారికంగా విడుదల చేసింది. ఇందులో కులంతో పాటు ఆధార్, బ్యాంక్ వివరాలు నమోదు చేయనున్నారు.

Also Read : 1947లో మీరు రూ. 1,000 విలువైన బంగారం కొనుగోలు చేసి ఉంటే, నేడు దాని విలువ ఎంతో తెలుసా?

ఇప్పటికే జనగణన జరగాల్సి ఉండగా కోవిద్‌ కారణంగా వాయిదా పడింది. దీంతో 2027 లో జనాభా లెక్కలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నిన్న( ఆగస్టు 14న) కేంద్ర ప్రభుత్వం రెండో దశ జనాభా లెక్కింపు (పాపులేషన్ ఎన్యుమరేషన్) కోసం 40 ప్రశ్నలతో కూడిన పూర్తి జాబితాను అధికారికంగా నోటిఫై చేసింది . ఈసారి జనాభా లెక్కల్లో కులంతో పాటు మతం, మాతృభాష, విద్య, ఉపాధి, వలసలు, కుటుంబ వివరాలకు సంబంధించిన ప్రశ్నలు ఉండనున్నాయి. అలాగే ధార్ నంబర్, మొబైల్ నంబర్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి కీలక సమాచారాన్ని కూడా ప్రజల నుంచి సేకరిస్తారు. ప్రతి ఒక్కరికి 40 ప్రశ్నలు అడగనున్న క్రమంలో జనాభా లెక్కల ఫారం చాలా పెద్దదిగా ఉండనుంది. డేటా పరంగా భవిష్యత్తు విధానాలకు ఇది అత్యంత కీలకం మారనుంది. అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న జనాభా లెక్కల ప్రక్రియ ఎట్టకేలకు మొదలవ్వనుంది. పదిహేనేళ్ల విరామం తర్వాత దేశంలో జరగనున్న ఈ మహా క్రతువుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది.

ప్రత్యేక కాలంగా కుల గణన

కాగా, ఈసారి ప్రశ్నల జాబితాలో 10 వ ప్రశ్నగా కులం ఉండనుంది. ఈ పదవ ప్రశ్నపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ‘ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర కులాలు’ అని ఈ కాలమ్‌లో స్పష్టంగా అడగనున్నారు. కులం పేరు నమోదు చేసేందుకు కాలమ్ ఖాళీగా ఉంచనున్నారు. ప్రజలు ఏ కులం పేరు చెబితే అదే పేరుతో అధికారులు నమోదు చేయనున్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వివరాలు మాత్రమే సేకరించేవారు. కానీ తొలిసారిగా అన్ని కులాల లెక్కలు తీయనుండటంతో భవిష్యత్తులో రిజర్వేషన్లు, సామాజిక ప్రాతినిధ్యంపై విధాన పరమైన నిర్ణయాలకు ఈ డేటా అత్యంత కీలకం కానుంది.

ఆర్థిక, ఆరోగ్య వివరాల సేకరణ

ఇక ఇందులో మరో ఆసక్తికర ప్రశ్నం కోవిడ్ వ్యాక్సిన్ ఎక్కడ వేసుకున్నారనే ప్రశ్న కూడా ఉంది. ఆరోగ్యపరమైన సమాచారానికి ఇది ఉపకరిస్తుంది. అలాగే డిజిటల్ అక్షరాస్యత స్థాయి, ఉపాధి వివరాలు, చేస్తున్న వృత్తి, గత ఏడాది కాలంలో పనిచేసిన తీరును నమోదు చేస్తారు. సొంత ఊరు విడిచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడానికి గల కారణాలు, ప్రస్తుతం ఉంటున్న ప్రాంతంలో ఎంత కాలంగా నివసిస్తున్నారనే వివరాలు కూడా ఈ ప్రశ్నల్లో ఉన్నాయి. మహిళలకు సంబంధించి పిల్లల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయనున్నారు.

Also Read : అరుణాచల్‌లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది మిస్సింగ్‌

ప్రారంభం ఎప్పుడంటే?

కాగా రెండో దశ జనగణన 2026 ఆగస్టు 17న లడఖ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ప్రారంభం కానుది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం 2027 ఫిబ్రవరిలో ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఈసారి కేవలం జనాభాను లెక్కించడం మాత్రమే కాకుండా దేశ సామాజిక, ఆర్థిక ముఖచిత్రాన్ని సమగ్రంగా ఆవిష్కరించేందుకు కేంద్రం సిద్ధమవడం గమనార్హం.
జనగణనలో అడిగే 40 ప్రశ్నలు ఇలా

1. వ్యక్తి పేరు

2. కుటుంబ యజమానితో సంబంధం

3. లింగం

4. పుట్టిన తేదీ, వయస్సు

5. ప్రస్తుత వైవాహిక స్థితి

6. వివాహ సమయానికి వయస్సు

7. జీవిత భాగస్వామి పేరు
8. పౌరసత్వం (స్వయంగా ప్రకటించిన ప్రకారం)

9. మతం

10. షెడ్యూల్డ్ కులం (SC) / షెడ్యూల్డ్ తెగ (ST) / కులం

11. తండ్రి వివరాలు

12. తల్లి వివరాలు

13. వైకల్యం వివరాలు

14. మాతృభాష, ఇతర తెలిసిన భాషలు

15. అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత స్థితి

16. విద్యాసంస్థకు హాజరవుతున్న తీరు

17. అత్యధిక విద్యా అర్హత, చదివిన విభాగాలు

18. గత సంవత్సరంలో చేపట్టిన పని/ఉపాధి

19. ఆర్థిక కార్యకలాపాల వర్గం

20. వృత్తి

21. పరిశ్రమ, వ్యాపారం లేదా సేవ స్వభావం

22. కార్మికుడి వర్గం

23. ఆర్థికేతర కార్యకలాపాలు (ఉపాధి లేనివారు, స్వల్ప ఉపాధి పొందుతున్నవారి కోసం)

24. పని కోసం వెతుకుతున్నారా/పనికి సిద్ధంగా ఉన్నారా?

25. పని ప్రదేశానికి ప్రయాణ మార్గం

26. పుట్టిన ప్రదేశం

27. చివరిగా నివసించిన ప్రాంతం

28. వలసకు గల కారణం

29. ప్రస్తుత గ్రామం/పట్టణంలో నివాస వ్యవధి

30. శాశ్వత నివాస చిరునామా

31. ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లల సంఖ్య (వివాహిత, వితంతువు, విడాకులు పొందిన, విడిపోయిన మహిళలకు మాత్రమే)

32. మొత్తం జన్మనిచ్చిన పిల్లల సంఖ్య (వివాహిత, వితంతువు, విడాకులు పొందిన, విడిపోయిన మహిళలకు మాత్రమే)

33. గత ఒక సంవత్సరంలో జన్మనిచ్చిన పిల్లల సంఖ్య (ప్రస్తుతం వివాహ బంధంలో ఉన్న మహిళలకు మాత్రమే)

34. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న ప్రదేశం

35. ఉన్న మొత్తం బ్యాంక్ ఖాతాల సంఖ్య

36. మొబైల్ సంఖ్య (లభ్యతను బట్టి)

37. ఆధార్ సంఖ్య (లభ్యతను బట్టి)

38. ఓటరు ఐడీ సంఖ్య (లభ్యతను బట్టి)

39. పాస్‌పోర్ట్ సంఖ్య (భారత పాస్‌పోర్ట్ ఉన్నవారికి)

40. డ్రైవింగ్ లైసెన్స్ లభ్యత

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.