New Delhi : సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసి జనాలు బాగా అప్ డేట్ అయిపోయారు. హత్యలు ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలో అని ప్లాన్ చేసి మరి హత్యలు చేస్తున్నారు. కానీ తప్పు చేశాక ఎప్పటికైనా దొరికిపోవాల్సిందేనన్న విషయాన్ని మరిచిపోతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాపులర్ వెబ్ సిరీస్ ది స్టేర్‌కేస్ చూసి, అందులో చూపించిన ప్లాన్ల ప్రకారం సొంత భార్యనే అత్యంత దారుణంగా హత్య చేసి, రూ. 12.75 లక్షల క్యాష్‌తో పారిపోయాడో సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్‌. ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేశారు. ఆస్తి గొడవలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ హత్యను చేసినట్లుగా ఆతను విచారణలో వెల్లడించాడు.

ఈ ఘటన జూలై 30న జరిగింది. 62 ఏళ్ల సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్ కమల్ సింగ్, అతని భార్య కోమల్ సింగ్ మాత్రమే ఇంట్లో ఉండగా ఈ ఘటన జరిగింది. వాళ్ల 26 ఏళ్ల కొడుకు గౌరవ్ సింగ్ లైబ్రరీకి, కూతురు ఆఫీస్‌కు వెళ్లగా, పనిమనిషి కూడా త్వరగానే ఇంటి పని ముగించుకుని వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 12:45 టైమ్‌లో కోమల్ బాల్కనీలో బట్టలు ఆరేస్తుండగా, కమల్ వెనక నుంచి వచ్చి కత్తితో తల వెనుక భాగంలో బలంగా నరికాడు. అయితే ఆ దెబ్బకి ఆమె కిందపడిపోకుండా, భయంతో గట్టిగా అరుస్తూ కిచెన్‌లోకి పరిగెత్తి దాక్కుంది. దాంతో కమల్ ఆమెను జుట్టు పట్టుకుని లివింగ్ రూమ్‌లోకి లాక్కొచ్చి, కత్తెరతో దారుణంగా పొడిచి పొడిచి చంపేశాడు.

ఆ టైమ్‌లో కోమల్ పెట్టిన కేకలు చుట్టుపక్కల వాళ్లకి స్పష్టంగా వినిపించినా ఎవరూ హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. చివరకు కమల్ తండ్రి కూడా తన భార్యను వెళ్లి ఏం జరుగుతుందో చూడమని చెప్పగా, ఆవిడ మనకెందుకు వాళ్ల గొడవలు అని లైట్ తీసుకుంది. భార్య చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక, కమల్ తన బ్లడ్ మరకలైన బట్టలు, కత్తిని ఒక బ్యాగ్‌లో పెట్టాడు. ఆ తర్వాత 15 నిమిషాల పాటు ప్రశాంతంగా షవర్ బాత్ చేసి, స్కూటర్‌పై పారిపోయాడు. దారిలో ఆ బ్యాగ్‌ను పారేసి, రెండు బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ. 7 లక్షలు విత్‌డ్రా చేశాడు. భార్య రూమ్‌లోని రూ. 5 లక్షల క్యాష్‌తో కలిపి, మొత్తం రూ. 12,75,00,0 క్యాష్‌తో ఎస్కేప్ అయ్యాడు.

Also Read : రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి.. పోలీసుల తీరుపై అనుమానాలు?

అదే రోజు రాత్రి 9:15 ప్రాంతంలో కొడుకు గౌరవ్ సింగ్ ఇంటికి వచ్చేసరికి తల్లి రక్తపు మడుగులో శవమై కనిపించింది. అంతకుముందు అతను మదర్‌కి చాలాసార్లు ఫోన్ చేసినా ఆమె ఆన్సర్ రాలేదు. స్పాట్‌లో హత్యకు వాడిన కత్తెర దొరికినప్పటికీ, కత్తి మాత్రం మిస్ అయింది. ఫాదర్ కూడా కనిపించకపోవడంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ స్పీడప్ చేశారు. పోలీసులను రాంగ్ రూట్‌లో తిప్పడానికి కమల్ చాలా తెలివిగా ప్లాన్ చేశాడు.

ఫస్ట్ ఫోన్ ఆన్ చేసి గొరఖ్‌పూర్ వైపు వెళ్లాడు, దీంతో అతను నేపాల్ పారిపోతున్నాడని పోలీసులు అనుకున్నారు. కానీ గొరఖ్‌పూర్ చేరాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, సీక్రెట్‌గా మథుర వైపు వెళ్లాడు. ఫైనల్‌గా మూడు రోజుల సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఢిల్లీ పోలీసులు మథుర రైల్వే స్టేషన్ దగ్గర కమల్‌ను అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి స్కూటర్ తో పాటు రూ. 12.75 లక్షల మొత్తం క్యాష్‌ను రికవర్ చేశారు.

పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో కమల్ షాకింగ్ విషయాలు చెప్పాడు. ది స్టేర్‌కేస్ అనే క్రైమ్ వెబ్ సిరీస్ చూసి, మర్డర్ వెపన్‌ను మాయం చేస్తే ఆధారాలు ఉండవని, కేసు వీక్ అవుతుందని అనుకుని ఇలా చేసినట్లు ఒప్పుకున్నాడు. నేపాల్ పారిపోవడానికి ప్లాన్ చేసినట్లు చెప్పాడు. గతేడాది నుంచి తమ మధ్య రిలేషన్స్ అస్సలు బాగులేవని, ముంబై ట్రిప్‌లో కమల్ మరొక అమ్మాయికి దగ్గరవ్వడం వల్ల గొడవలు ఎక్కువయ్యాయని పోలీసుల విచారణలో తేలింది. పలు సెక్షన్ల కింద కమల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read : పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడిని లేపేసింది.. హర్యానాలో దారుణం!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.