Gurugram :  ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే పడే జరిమానాలు ఒక్కోసారి మనకు ఊహించని షాక్‌లకు గురిచేస్తుంటాయి. పోలీసులు చూస్తే కదా.. ఒకసారికి ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి గురుగ్రామ్‌లో జరిగిన ఈ ఘటనే కన్నువిప్పు కలిగిస్తుంది. పోలీసులకు అడ్డంఆగా దొరికిపోయిన ఆ యువకుడు నడుపుతున్న స్కూటర్ ధర కంటే, దానికి పడిన ఫైన్ల మొత్తమే రెండింతలు ఎక్కువగా ఉండి అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.

సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు ఒక స్కూటర్ రైడర్‌ను ఆపగా, ఆ వాహనంపై ఏకంగా రూ.1,00,000 పెండింగ్ చలానాలు ఉన్నట్లు తేలింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ ఫైన్ల మొత్తం ఆ స్కూటర్ అసలు ఖరీదు కంటే రెండింతలు ఎక్కువ కావడం గమనార్హం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌లోని రాజీవ్ చౌక్ సమీపంలో ప్రశాంత్ అనే ఓ యువకుడు హెల్మెట్ పెట్టుకోకుండా మెదాంత ఆసుపత్రి వైపు రాంగ్ రూట్ లో వెళుతూ పోలీసులకు చిక్కాడు. దీంతో పోలీసులు బైకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఆడగగా లేవని సమాధానం చెప్పాడు ప్రశాంత్. దీంతో పోలీసులు ఆన్ లైన్ లో బైక్ నెంబర్ తో చలనాలు చెక్ చేయగా ఏకంగా రూ.లక్ష కనిపించాయి. ఈ చలానాలు అన్ని 2017 నుండి 2024 మధ్య కాలంలో పడ్డాయి.

హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, బైకుకు ఇన్సూరెన్స్ లేకపోవడం, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోవడం. రాంగ్ సైడ్‌లో వెళ్లడం వలన చలనా పడ్డాయి. పోలీసుల విచారణలో ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం ఈ స్కూటర్2017 మోడల్. ప్రస్తుతం దీని ధర రూ. 50 వేలు. అంటే, ఒకవేళ ఆ స్కూటర్‌ను ఇప్పుడు అమ్మేసినా సరే.. వచ్చిన డబ్బులతో సగం ఫైన్ కూడా చెల్లించలేరన్నమాట. ఈ స్కూటర్ కూడా అతని సోదరిది. ఇక ప్రశాంత్ మెదాంత ఆసుపత్రి సమీపంలోని ఒక మెడికల్ షాప్‌లో పనిచేస్తున్నాడు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.