BIG BREAKING: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు.. నేటి నుంచి అమల్లోకి

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల ఎఫెక్ట్‌తో భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా పెరిగాయి. చమురు సంస్థలు లీటరు పెట్రోల్‌పై సగటున రూ. 3, డీజిల్‌పై రూ. 3 చొప్పున ధరలు పెంచాయి. ఈ పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ. 3.29, డీజిల్‌పై రూ. 3.14 పెరిగింది. ఇక తెలంగాణలో చూసుకుంటే పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 చొప్పున ధరలు పెరిగాయి.

Also Read: చార్ ధామ్ యాత్ర .. 38 మంది మృతి

మెట్రో నగరాల్లో కూడా ధరలు భారీగా పెరిగాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ. 97.77కు చేరింది. ముంబయిలో గరిష్ఠంగా రూ. 106.68గా నమోదైంది. కోల్‌కతాలో రూ. 108.74, చెన్నైలో రూ. 103.67కు పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇక డీజిల్‌ విషయానికొస్తే.. ఢిల్లీలో రూ. 90.67, కోల్‌కతాలో రూ. 95.13, ముంబయిలో రూ. 93.14, చెన్నైలో రూ. 95.25కు చేరాయి. అకస్మాత్తుగా పెరిగిన ఈ ధరలు రవాణా ఖర్చులపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: నీట్ యూజీ పరీక్ష తేదీపై కీలక అప్‌డేట్